48 మెగాపిక్సెల్ కెమెరా... అదిరిపోయే ఫీచర్లు... Honor View 20 రిలీజ్
Honor View 20... హానర్ నుంచి వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్. ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్లో హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. మరి ఆ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.


1. ఇప్పుడు అంతా నాచ్ డిస్ప్లే స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. కానీ హానర్ మాత్రం నాచ్ డిస్ప్లేను పంచ్ హోల్ డిస్ప్లేతో రీప్లేస్ చేసి అబ్బురపర్చింది. సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ హానర్ వీ20 డిస్ప్లే ఆకట్టుకుంటోంది. (Image: tech2/Omkar Patne)


2. ప్యారిస్‌లో అధికారికంగా లాంఛ్ అయిన హానర్ వీ20 ఇండియాలో జనవరి 29న రిలీజ్ కానుంది. ఈ ఫోన్ ఇండియాలో వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీ ఇవ్వొచ్చని అంచనా. (Image: tech2/Omkar Patne)


3. HiHonor స్టోర్‌లో ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. హానర్ వీ20 బుక్ చేసేవారికి రూ.2,999 విలువైన హానర్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ రూ.1,000 ధరకే పొందొచ్చు. (Image: tech2/Omkar Patne)


4. హానర్ వీ20 డిస్ప్లే: 6.4 అంగుళాల ఫుల్హెచ్డీ+, 1080x2310 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 91.8 స్క్రీన్-టు-బాడీ రేషియో. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ లాంటి ఫీచర్లున్నాయి. (Image: tech2/Omkar Patne)


5. హానర్ వీ20 ర్యామ్: 6 జీబీ, 8జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ, 256 జీబీ. ప్రాసెసర్: ఆక్టాకోర్ కిరిన్ 980 చిప్సెట్. (Image: tech2/Omkar Patne)


6. హానర్ వీ20 అతిపెద్ద కెమెరాతో రావడం విశేషం. ఈ ఫోన్ రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్. సెల్ఫీ కెమెరా 25 మెగాపిక్సెల్. (Image: tech2/Omkar Patne)


7. హానర్ వీ20 బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ పై, మ్యాజిక్ యూఐ 2.0తో ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. (Image: tech2/Omkar Patne)