HMD GLOBAL CUTS NOKIA C3 SMARTPHONE PRICE KNOW LATEST RATES SS
Nokia C3: నోకియా సీ3 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది... లేటెస్ట్ రేట్స్ ఇవే
Nokia C3 | నోకియా ఇటీవల రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. కొద్ది రోజుల క్రితం నోకియా సీ3 స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ ధరను తగ్గించింది హెచ్ఎండీ గ్లోబల్. లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి.
1. నోకియా సీ3 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది హెచ్ఎండీ గ్లోబల్. 2జీబీ+16జీబీ వేరియంట్‌తో పాటు 3జీబీ+32జీబీ వేరియంట్ ధరల్ని తగ్గించింది. 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ.500 తగ్గగా, 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.1,000 తగ్గింది. (image: Nokia India)
2/ 7
2. ప్రస్తుతం నోకియా సీ3 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+16జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999 ధరకు, 3జీబీ+32జీబీ వేరియంట్ మోడల్‌ను రూ.7,999 ధరకు కొనొచ్చు. (image: Nokia India)
3/ 7
3. రిలీజ్ అయినప్పుడు నోకియా సీ3 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ.7,499 ఉండగా 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉండేది. (image: Nokia India)
4/ 7
4. ఇక నోకియా సీ3 ప్రత్యేకతలు చూస్తే ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఉండవు. (image: Nokia India)
5/ 7
5. నోకియా సీ3 స్పెసిఫికేషన్స్ చూస్తే 5.99 హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Nokia India)
6/ 7
6. నోకియా సీ3 రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. (image: Nokia India)
7/ 7
7. నోకియా సీ3 బ్యాటరీ 3,040ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Nokia India)