Hero MotoCorp: హీరో స్ప్లెండర్ దశాబ్దాలుగా కస్టమర్లకు ఇష్టమైన బైక్‌గా అని చెప్పొచ్చు. మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫీచర్లతో బైక్ లు వస్తున్నా.. దీనిని మాత్రమే ఇష్టపడే వారు అనేకం. తాజాగా Hero MotoCorp కొత్త స్ప్లెండర్ + XTECని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ఢిల్లీలో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,900 వద్ద ప్రవేశపెట్టబడింది.
ఈ 100cc మోటార్‌సైకిల్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ మరియు అనేక కొత్త ఫీచర్లతో పరిచయం చేయబడింది. అదనంగా, Splendor + XTEC ఐదేళ్ల వారంటీని అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్త Hero Splendor + XTEC పూర్తి డిజిటల్ మీటర్ ను కలిగి ఉంటుంది. ఇంకా.. కాల్ మరియు SMS అలర్ట్స్ లభిస్తాయి. రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ కూడా ఈ బైక్ లో ఉంటుంది.
ఇంకా ఈ కంపెనీ ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ఈ బైక్ బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఎల్ఈడీ హై-ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్ మరియు స్పెషల్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లను ఈ బైక్ కలిగి ఉంటుంది. USB ఛార్జర్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీని సైతం ఈ బైక్ కలిగి ఉంది.
డిజైన్ గురించి చెప్పాలంటే, Hero Splendor + XTECతో కూడిన LED పొజిషన్ ల్యాంప్కి కొత్త గ్రాఫిక్స్ కూడా అందించబడ్డాయి. మిగిలిన బైక్ ప్రొఫైల్‌లో ఎలాంటి మార్పు లేదు. కంపెనీ కొత్త బైక్‌ను స్పార్క్లింగ్ బీటా బ్లూ, కాన్వాస్ బ్లాక్, టోర్నాడో గ్రే మరియు పెరల్ వైట్లతో సహా నాలుగు విభిన్న రంగులలో పరిచయం చేసింది.
భద్రత కోసం, బైక్‌కు బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అందించబడింది, ఇది బైక్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.9 బిహెచ్పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద వద్ద 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది.