ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ (Airtel) 5G యూజర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా ఈ కంపెనీ అర్హత ఉన్న యూజర్లకు డైలీ డేటా లిమిట్ లేకుండా ఏకంగా అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ను అందించనున్నట్లు ప్రకటించింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ SIM యూజర్లు అన్లిమిటెడ్, ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో రీఛార్జ్ ప్లాన్స్ లిస్టు గమనిస్తే.. రూ.239 నుంచి రూ.3,359 రీఛార్జ్ ప్లాన్ వరకు ప్రతిదీ అదనంగా కస్టమర్లకు అపరిమిత 5G ఇంటర్నెట్ను ఉచితంగా ఆఫర్ చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ప్యాక్‌ను బట్టి వ్యాలిడిటీ, బెనిఫిట్స్ అనేవి ఇంతకు ముందులానే ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్రాగా అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ పొందవచ్చు.
ఎయిర్టెల్ యూజర్లు ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌కి లాగిన్ అయ్యి ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ 5G డేటా కోసం ఎయిర్టెల్ యూజర్ల ఫోన్లో ఎల్లప్పుడూ రూ.239 లేదా అంతకు మించిన ఏదో ఒక అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. ఒకవేళ కస్టమర్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ అయి ఉంటే, వారు అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను విడిగా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది
ఇక గతేడాది అక్టోబర్ నెలలో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్ ఇప్పటికే 500కి పైగా భారత నగరాల్లో 5G సేవలను విస్తరించింది. ఈ కంపెనీ రోజూ 30 నుంచి 40 నగరాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కడప, ఒంగోలు, ఏలూరు, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, ఇంకా తదితర నగరాల్లో 5G సేవలు లాంచ్ అయ్యాయి. ఇక తెలంగాణలో నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఎయిర్టెల్ 5G ప్లస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
వీటిలో ఒకటైన రూ.399 ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. రూ.359 ప్లాన్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. రూ.489 ప్లాన్ మొత్తం 50GB డేటాను 30 రోజుల పాటు ఆఫర్ చేస్తుంది. రూ.499 ప్లాన్ 3GB రోజువారీ డేటా, 28 రోజుల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.