కొన్ని ఫీచర్ల వల్ల పెద్దగా ఉపయోగం కనిపించడం లేదని నిపుణుల విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రైవసీ కోసం వాట్సాప్ ఆన్లైన్ స్టేటస్‌ను ఇతరులకు కనిపించకుండా హైడ్ చేసే ఫీచర్ ఆకర్షిస్తోంది. ఈ ఆప్షన్ ఇప్పుడు iOS, Android రెండింటిలోనూ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ లేటెస్ట్ ఫీచర్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* వాట్సాప్ ఆన్లైన్ స్టేటస్ కనిపించదు : ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్‌ను వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు. ఎవరికైనా తాము ఆన్లైన్లో ఉన్నట్లు తెలియకూడదు అనుకుంటే ఈ ఫీచర్ ద్వారా ప్రత్యేకంగా వారికే స్టేటస్ కనిపించకుండా హైడ్ చేయవచ్చు. ఈ ఆప్షన్‌ను ఏ సమయంలోనైనా సులభంగా ఎనేబుల్ చేయవచ్చు లేదా డిసేబుల్ చేసుకోవచ్చు.
* ఆన్లైన్లో స్టేటస్ హైడ్ చేయడం ఎలా? : మొదట వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. అనంతరం వాట్సాప్‌లో సెట్టింగ్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అందులో ప్రైవసీ ట్యాబ్ కింద, లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ స్టేటస్(Last Seen and Online Status) ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ అందుబాటులో ఉన్న ఆప్షన్లు.. ఎవ్రీవన్(Everyone), మై కాంటాక్ట్స్(My Contacts), నో బడీ(Nobody), మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్(My Contacts Except)లలో అవసరమైన దానిపై క్లిక్ చేయాలి.
నో బడీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే.. వాట్సాప్ ఆన్లైన్ స్టేటస్ ఎవ్వరికీ కనిపించదు. అదే విధంగా మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే సెలక్ట్ చేసిన కొందరికి మినహాయించి కాంటాక్ట్స్‌లోని మిగిలిన అందరికీ ఆన్లైన్ స్టేటస్ తెలుస్తుంది. చివరిగా సెట్టింగ్స్‌ను అప్లై చేయడానికి సేమ్ యాజ్ లాస్ట్ సీన్(Same as Last Seen) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* కాంటాక్ట్ సేవ్ చేయకనే వాట్సాప్ మెసేజ్ : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇతరుల ఫోన్ నంబర్ సేవ్ చేయకుండానే మెసేజ్ పంపవచ్చు. ప్రైవసీ కారణాలతో ఇతరుల నంబర్ సేవ్ చేయకూడదు అనుకున్న సందర్బాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే ఇలా చేయడానికి లేటెస్ట్ అప్డేట్ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ అవసరం.