* స్మార్ట్‌ఫోన్‌ను ట్రాక్ చేయవచ్చు : మీ స్మార్ట్‌ఫోన్ మొబైల్ ట్రాకింగ్ ఆప్షన్ యాక్టీవ్‌లో ఉంటే దాని ఆధారంగా అది ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు వాడేది ఐఫోన్ (iPhone) అయితే Find My iPhoneలోని, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే Find My Device అనే ఆప్షన్లు ఆన్‌లో ఉంటే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆఫ్ చేసి ఉంటే ట్రాకింగ్ కుదరదు.
* ఏదీ కుదరకపోతే! : స్మార్ట్‌ఫోన్ ట్రాకింగ్ లేదా డేటాను డిలీట్ చేయడం కుదరన్నప్పుడు వెంటనే మీ సిమ్ బ్లాక్ చేయించాలి. అదే నంబరుతో వేరే సిమ్ తీసుకుని ఆన్లైన్ అకౌంట్‌కు సంబంధించిన అన్ని యూజర్ నేమ్‌లు, పాస్వర్డులు మార్చేయాలి. సమస్య తీవ్రతను బట్టి మీ అకౌంట్లో నగదును తాత్కాలికంగా వేరే అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేయడం లేదా ఎఫ్డీ చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేస్తే నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.