Realme Narzo 30 5G: ఈ స్మార్ట్ పోన్ రూ.14, 999 కు ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇంకా సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంకా 18W ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
Poco M3 Pro 5G: ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం రూ. 14, 499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. 90Hz హై రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ లో 6GB ర్యామ్ తో పాటు 128 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో పాటు సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంకా 18W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.