Samsung Galaxy S22 Ultra శామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్‌లో లభించే అత్యంత ప్రీమియం మోడల్ 'అల్ట్రా'. గెలాక్సీ S21 ఆల్ట్రా ధర రూ.1,05,999గా ఉంది. ఈ సిరీస్‌లో 2022లో రానున్న మరో మోడల్ గెలాక్సీ S22 అల్ట్రా. ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్, ఎక్సినోస్ హార్డ్‌వేర్, యాక్సెసరీలు, కొత్త కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ S22 ఆల్ట్రాలో S పెన్ కోసం స్పెషల్ స్లాట్ ఉన్నట్లు తెలుస్తోంది.
పెద్ద స్క్రీన్ ఉండే ఐఫోన్ 14 మ్యాక్స్‌ను యాపిల్ అభివృద్ధి చేస్తోంది. ఇది 2022లో లాంచ్ కానుంది. దీని రిలీజ్‌కు అనుకూలంగా ఐఫోన్ 14 మినీని తమ సేల్స్ లిస్ట్ నుంచి సంస్థ తొలగించవచ్చని తెలుస్తోంది. అన్ని ఐఫోన్ 14 మోడల్‌లు 120Hz LTPO డిస్ప్లేలను కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 14 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు హోల్-పంచ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్లను కలిగి ఉన్నాయనే వార్తలు వచ్చాయి.
OnePlus 10 Pro వన్ ప్లస్ సంస్థ ఇప్పటికే 9 ప్రో మోడల్‌తో మంచి డిజైన్‌ను, కొన్ని కెమెరా అప్గ్రేడ్లను అందించింది. త్వరలో రానున్న వన్‌ప్లస్ 10 ప్రో సైతం ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల LTPO ఫ్లూయిడ్ 2 AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు.