*Micromax IN 2b: మైక్రోమ్యాక్స్ కంపెనీ ఎంట్రీ లెవల్ ఫోన్లలో మైక్రోమ్యాక్స్ ఐఎన్ 2బి ఒకటి. ఈ ఫోన్ 6.52 అంగుళాల హెచ్డి ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన డిస్ప్లేను కలిగి ఉంది. ఇది Unisoc T610 ప్రాసెసర్, 8 GB RAM (6GB RAM) కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో 13 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా కూడా అందించారు. మైక్రోమ్యాక్స్ IN 2b అనేది అధునాతన ఫీచర్లతో కూడిన తక్కువ ధర ఫోన్. ఫోన్ ఆన్లైన్లో 9000 రూపాయలలోపు లభిస్తుంది.
Realme Narzo 30A: ఇది 4G స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే వరుసగా రెండు రోజులు ఉంటుంది. Realme Narzo 30A 269 ppi రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల 720p LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB-C పోర్ట్, MediaTek Helio G85 ప్రాసెసర్, MediaTek Helio G85, 3GB RAM కూడా ఉన్నాయి. ఈ ఫోన్లోరెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు బ్లాక్ అండ్ వైట్ సెన్సార్. భారతీయ మార్కెట్లో Realme Nazro 30A ధర సుమారు రూ. 8,999. తక్కువ ధరకే ఈ ఫోన్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
Moto E7 Plus: ఈ ఫోన్ ధర భారతీయ మార్కెట్లో దాదాపు రూ.9,499. ఈ ఫోన్ 6.5 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇది 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్లో Qualcomm Snapdragon 460 Soc ప్రాసెసర్ మరియు 4 GB RAM ఉంది. Moto E7 Plus ఫోన్ తక్కువ ధరలో ఆధునిక ఫీచర్ల ప్రయోజనాన్ని అందిస్తుంది.
Realme C25: భారతీయ మార్కెట్లో Realme C25 ఫోన్ ధర దాదాపు రూ.9,999. ఈ ఫోన్ 16 W ఫాస్ట్ ఛార్జ్‌తో 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ ఉన్నాయి. ఈ ఫోన్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. పెద్ద డిస్ప్లే ఉన్న ఈ ఫోన్ ధర దాదాపు రూ.10,000.