Samsung Galaxy M13 5G: ఇది బెస్ట్ స్మార్ట్ఫోన్లలో ఒకటి. Samsung Galaxy M13 5G ఆక్టా కోర్ (2.2 GHz) ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 4GB, 64GB స్టోరేజ్ మరియు 5000mAh బ్యాటరీ ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే, ఇందులో 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరా మరియు 5 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. భారతదేశంలో Samsung Galaxy M13 5G ధర రూ.13,999.
Moto g51 5G : ఇది కూడా 15 వేల రూపాయలలోపు వచ్చే గొప్ప 5G స్మార్ట్ఫోన్ల జాబితాలో ఒకటి. దీని ఫీచర్లు 4 GB RAM, 64 GB ROM, 17.27 cm (6.8 inch) ఫుల్ HD + డిస్ప్లే, 50MP + 8MP + 2MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా, Qualcomm Snapdragon 480 Pro ప్రాసెసర్ మరియు 5000 mAH లిథియం పాలిమర్ బ్యాటరీ. అమెజాన్‌లో దీని ధర రూ.14,999.