ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫీచర్లపై పనిచేస్తుంది. వాట్సాప్ తాజాగా యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని కొత్త ఫీచర్ (WhatsApp New Features) ను అందుబాటులోకి తెచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ ఫీచర్ ద్వారా మీ లాస్ట్ సీన్ టైమ్ లేదా మీరు ప్రస్తుతం ఆన్ లైన్ లో ఉన్నారా..? లేదా..? అనే విషయాన్ని ఇతరులు ట్రాక్ చేయలేరు. అంటే మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తి లేదా మీకు తెలియని వ్యక్తి మీరు చివరిసారి వాట్సాప్‌ను ఎప్పుడు ఉపయోగించారు..? ఆన్ లైన్ స్టేటస్‌ను చూడలేరు. యూజర్లకు మరింత ప్రైవసీ కల్పించేందుకే ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఒకేసారి ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇన్స్టంట్ మెసేజింగ్ విభాగంలో వాట్సాప్‌కు గట్టి పోటీనిస్తోన్న టెలిగ్రామ్ ఇటీవల ప్రైవసీ ఫీచర్‌ను ప్రకటించడంతో పోటీగా వాట్సాప్ కూడా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో వివిధ రకాల థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా యూజర్ల లాస్ట్ సీన్ టైమ్, ఆన్ లైన్ స్టేటస్ ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇతర వాట్సాప్ యూజర్లను ట్రాక్ చేసేందుకు కొంతమంది వ్యక్తులు ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తుల ప్రైవసీకి భంగం వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)