* Redmi Note 10T 5G : ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. f/1.79 ఎపర్చర్‌తో 48 MP ప్రైమరీ కెమెరా, 2 MP మాక్రో లెన్స్, 2 MP డెప్త్ సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ హ్యాండ్సెట్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 64GB వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6GB of RAM + 128GB వేరియంట్ ధర రూ.13,999.
* Realme 9 5G : ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.12,999కు లభిస్తోంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-HD+ రిజల్యూషన్‌తో లభిస్తుంది. మీడియా టెక్ టైమెన్షిటీ 810 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్మీ 9 5G ఫోన్ మూడో వేరియంట్లలో లభిస్తుంది. 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ కెమెరా, మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత.
* ఇన్ఫినిక్స్ హాట్ 20 5G : ఈ హ్యాండ్సెట్ మార్కెట్లో రూ.11,499కు అందుబాటులో ఉంది. 1080 x 2408 పిక్సెల్స్, 60, 90, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ డిస్ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఇది 6GB RAM +64GB, 6GB RAM +128GB వంటి రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ డివైజ్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. ఇందులో f/1.6 ఎపర్చరుతో 50MP మెయిన్ కెమెరా, డ్యూయల్ LED ఫ్లాష్ ఉంటుంది. f/2.0 ఎపర్చర్‌తో సెకండరీ AI 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోన్ ముందు భాగంలో ఉండనుంది. బ్యాటరీ సామర్థ్యం 5000mAhగా ఉంటుంది.
* POCO M4 Pro 5G : ఈ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.12,999కు అందుబాటులో ఉంది. 1080p రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల IPS డిస్ప్లేతో ఈ హ్యాండ్సెట్ అందుబాటులో ఉంది. ఇందులో 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 16MP ఫ్రంట్ కెమెరా అమర్చారు.
* ఇన్ఫినిక్స్ నోట్ 12 5G : ఇన్ఫినిక్స్ కంపెనీకి చెందిన ఈ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం రూ.12,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ (f/1.6) ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇది 2400x1080 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6GB RAM ఉంటుంది.