5G సేవలు (5G Services) ఇండియా (India)లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీ(Smartphones)లు ఇప్పటికే మార్కెట్లో ఈ కనెక్టివిటీ ఆప్షన్లతో ఫోన్లను లాంచ్ చేశాయి. 5G కనెక్టివిటీ ఫీచర్ టాప్-టైర్ స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితం కాదు. కస్టమర్లకు రూ.20,000 వేల లోపు డివైజ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. 2022 ఆగస్టులో పరిశీలించగల 5G ఫోన్లు ఇవే..
* iQoo Z6 5G : ఐక్యూ Z6 5G ఫోన్ రెండు బ్యాండ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు ఇందులో బెస్ట్ గేమింగ్ ఆస్వాదించవచ్చు. వెబ్ బ్రౌజింగ్ వంటి ఇతర రోజువారీ పనులను కూడా ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇది వన్‌ప్లస్ నార్డ్ CE 2 Lite 5G పనితీరును అందిస్తుంది. మోటొరోలా స్మార్ట్ఫోన్లను ఇష్టపడని వినియోగదారులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. భారతదేశంలో ఐక్యూ Z6 5G ధర:రూ. 16,999గా ఉంది.
OnePlus Nord 2 CE Lite 5G : 5G ఫోన్ కోసం చూస్తున్నవారికి వన్‌ప్లస్ నార్డ్ CE 2 5G స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో AMOLED స్క్రీన్కు బదులుగా LCD స్క్రీన్ వస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. కెమెరాలు పనితీరు పగటిపూట బాగుంటుంది. ఫోన్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ దాదాపు 30 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 CE Lite 5G భారతదేశంలో మొత్తం ఐదు 5G బ్యాండ్లతో వస్తుంది. భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ.19,999గా ఉంది.
Redmi Note 11T 5G : రెడ్మీ భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. రెడ్మీ Note 11T 5G స్మార్ట్‌ఫోన్ బెస్ట్ కెమెరాలను అందిస్తుంది. ఫోన్ 7 బ్యాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. LCD స్క్రీన్‌ను అందిస్తుంది. సొగసైన ఫోన్లను ఇష్టపడే వినియోగదారులకు నచ్చుతుంది. భారతదేశంలో రెడ్మీ నోట్ 11T 5G ధర రూ.15,999గా ఉంది.
Moto G62 5G : మోటో G62 5G స్మార్ట్‌ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు నచ్చుతుంది. దీనికి 12, 5G బ్యాండ్ల సపోర్ట్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. మంచి కెమెరాలను అందిస్తుంది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. భారతదేశంలో మోటో G62 5G ధర రూ.17,999గా ఉంది.