ఒకప్పుడు మంచి కెమెరా, బెస్ట్ బ్యాటరీ, లేటెస్ట్ చిప్సెట్తో వచ్చే స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా ఉండేవి. కానీ ఇప్పుడు బడ్జెట్ రేంజ్‌లోనే అన్ని కంపెనీలు ఇలాంటి స్పెసిసిఫికేషన్ల (Specifications)తో ఫోన్లను తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా రూ.20వేల రేంజ్లో మీడియం లెవల్ ఫీచర్లతో చాలాఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మీరు కూడా ఇదే బడ్జెట్లో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే, ఈ నెలలో కొనుగోలు చేయడానికి ఉన్న ఆప్షన్లు ఏవో చూడండి.
* రెడ్మీ నోట్ 11T 5G : స్మార్ట్‌ఫోన్‌లో 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్ ఉండే 6.6 అంగుళాల FHD+ డిస్ప్లే ఉంటుంది. రెడ్మీ నోట్ 11T 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంట్లోని 5,000mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ MIUI 12.5తో రన్ అవుతుంది.
* ఐక్యూ Z5 5G : ఐక్యూ Z5 5G ఫోన్లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 44w ఫ్లాష్ చార్జ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ FunTouchOS 11తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో ఈ హ్యాండ్సెట్ మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
* వివో T1 : ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో వస్తుంది. దీంట్లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. వివో T1 ఫోన్ 6.44 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సిస్టమ్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది.