1. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 ఏళ్ల వయస్సు పైబడ్డవారందరికీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం భారతదేశంలో కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తోంది ప్రభుత్వం. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆన్లైన్లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొదటి డోసు తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి. రెండో డోసు కూడా పూర్తైన తర్వాత మరోసారి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పేరు, పుట్టిన తేదీ, రిఫరెన్స్ ఐడీ, వ్యాక్సిన్ పేరు, ఆస్పత్రి పేరు, వ్యాక్సిన్ తీసుకున్న తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)