1. ఈరోజుల్లో హ్యాకర్లు చాలా సులభంగా యూజర్ల అకౌంట్స్‌ను హ్యాక్ చేస్తున్నారు. ఇంటర్నెట్ యూజర్లు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసినా సరే హ్యాకింగ్‌కి గురవుతున్నారు. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న లాగిన్ విధానాన్ని మార్చేసి పాస్‌వర్డ్‌లను మరింత సేఫ్‌గా ఉంచేందుకు గూగుల్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తాజాగా గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్‌లు, క్రోమ్ (Chrome)లో కొత్త పాస్కీ (Passkey) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ పాస్కీ ఫీచర్‌తో పాస్వర్డ్కి బదులు ఏదైనా వెబ్సైట్ లేదా యాప్‌కి లాగిన్ కావడానికి పిన్స్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్లు ఉపయోగించవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలపర్లు టెస్ట్ చేయడానికి మాత్రమే అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. గూగుల్ ఈ ఏడాది చివరిలో సామాన్య యూజర్లకు కూడా ఈ పాస్కీ ఫీచర్‌ను అందించాలని ప్లాన్ చేస్తోంది. పాస్వర్డ్ మాదిరిగా కాకుండా, పాస్కీ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. దీనిని మళ్లీ ఉపయోగించాల్సిన అవసరం రాదు. పాస్వర్డ్ ఆటోఫిల్(Password Autofill)లా ఈ పాస్కీ పనిచేస్తుంది. పాస్కీ 'గూగుల్ పాస్వర్డ్ మేనేజర్'కి బ్యాకప్ అవుతుంది కాబట్టి సింక్ (Sync) చేయాల్సిన అవసరం రాదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎందుకంటే ఓల్డ్ డివైజ్ నుంచి కొత్త ఆండ్రాయిడ్ డివైజ్‌కు డేటాను బదిలీ చేసినప్పుడు.. ఇప్పటికే ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కీలు సెక్యూర్‌గా కొత్త డివైజ్‌కు బదిలీ అవుతాయి. యూజర్లు గూగుల్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లో పాస్‌కీని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రిజిస్టర్డ్ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్‌ని ఉపయోగించి ఐడెంటిటీని అథెంటికేట్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. పాస్కీ అనేది క్రిప్టోగ్రాఫిక్ ప్రైవేట్ కీ అని గూగుల్ చెబుతోంది. ఈ ప్రైవేట్ కీ ల్యాప్టాప్స్ లేదా మొబైల్ ఫోన్ల వంటి యూజర్ ఓన్ డివైజ్‌ల్లో మాత్రమే ఉంటుంది. గూగుల్ ప్రకారం, పాస్కీ క్రియేట్ చేసినప్పుడు దాని సంబంధిత పబ్లిక్ కీ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ ద్వారా స్టోర్ అవుతుంది. ఆన్లైన్ సర్వీస్ లాగిన్ సమయంలో ప్రైవేట్ కీ నుంచి సిగ్నేచర్ వెరిఫై చేయడానికి పబ్లిక్ కీని ఉపయోగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇది యూజర్ డివైజ్ నుంచి మాత్రమే వస్తుంది. ఇది జరగాలంటే యూజర్ వారి డివైజ్ లేదా క్రెడెన్షియల్ స్టోర్‌ను అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. ఫోన్‌ను ఎవరైనా కొట్టేసినప్పుడు వారు సైన్-ఇన్లను చేయకుండా నిరోధించడంలో ఈ రెస్ట్రిక్షన్ సహాయపడుతుంది. డెవలపర్లు ఇప్పుడు వారి ఆండ్రాయిడ్ యాప్‌ల కోసం కొత్త అథెంటికేషన్ మోడ్ పరీక్షించడానికి గూగుల్ ప్లే సర్వీసెస్ బీటాలో నమోదు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. WebAuthn API ద్వారా ఆండ్రాయిడ్, ఇతర మద్దతు ఉన్న ప్లాట్‌ఫామ్‌లలో క్రోమ్‌ను ఉపయోగించే ఎండ్ యూజర్ల కోసం వెబ్ అడ్మిన్స్ వారి సైట్లలో పాస్కీ సపోర్ట్‌ను కూడా రూపొందించవచ్చు. మరికొద్ది వారాలు లేదా నెలల్లో, గూగుల్ స్థానిక ఆండ్రాయిడ్ యాప్‌ల కోసం APIని కూడా విడుదల చేస్తుంది. ఇది మొబైల్ అప్లికేషన్లలో లాగిన్ చేయడానికి వెబ్ పాస్‌కీలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)