6. ఇక ఎక్కువ స్టోరేజ్ ఉపయోగిస్తున్నవారి కోసం గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది గూగుల్. ప్రతీ అకౌంట్‌కు 15 జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా ఇస్తుంది గూగుల్. అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ వాడటానికి అవకాశం ఉండదు. ఎక్కువ స్టోరేజ్ వాడుకోవాలంటే గూగుల్ వన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. కానీ 2021 జూన్ 1 నుంచి ఏ క్వాలిటీతో అప్లోడ్ చేసినా 15జీబీ డిఫాల్ట్ స్టోరేజ్లోకే వెళ్తుంది. ఫ్రీగా అప్లోడ్ చేసే అవకాశం ఉండదు. అయితే 2021 జూన్ 1 కన్నా ముందు అప్లోడ్ చేసిన ఫోటోలకు ఈ రూల్ వర్తించదు. జూన్ 1 తర్వాత అప్లోడ్ చేయబోయే ప్రతీ ఫోటో ఇక 15జీబీ స్టోరేజ్‌లోనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ ఫోటోస్ ఉపయోగించేవారందరికీ ఇది వర్తిస్తుంది. గూగుల్ ఫోటోస్‌లోకి మీరు అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలు డిఫాల్ట్ స్టోరేజ్లోకే వెళ్తాయి. 15జీబీ వరకు ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ వాడుకోవాలంటే గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. గూగుల్ ఫోటోస్‌లో మీ ఫోటోలు, వీడియోలు మేనేజ్ చేయడానికి, డిలిట్ చేయడానికి కొత్త టూల్‌ను అందించబోతోంది గూగుల్. డార్క్, బ్లర్ ఫోటోస్, లార్జ్ వీడియోస్‌ను ఈ టూల్ గుర్తించి యూజర్లకు సూచిస్తుంది. వాటిని యూజర్లు డిలిట్ చేయొచ్చు. 2021 జూన్ నాటికి ఈ టూల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)