Mitron App : ఇండియాలో టిక్‌టాక్‌కి పోటీగా వచ్చిన మిత్రాన్ యాప్‌ని గూగుల్ సంస్థ... తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ మేనేజ్మెంట్... స్పామ్, కనీస కార్యాచరణ రూల్స్ ఉల్లంఘించినట్లు గూగుల్ తెలిపింది. చైనాపై వ్యతిరేకతతో చాలా మంది చైనా యాప్స్ వాడటం మానేస్తున్నారు. టిక్‌టాక్ యాప్... చైనాకి చెందిన బైట్ డాన్స్ కంపెనీ రూపొందించినది కావడంతో... ఇండియాలో చాలా మంది టిక్‌టాక్‌ను అదే సమయంలో... మిత్రాన్ యాప్ (Mitron App)ను ఇన్స్టాల్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది కూడా అచ్చం టిక్‌టాక్ లాంటిదే. ఇది ఓ భారతీయుడు రూపొందించినది కావడంతో... దీనికి పాపులార్టీ బాగా పెరిగింది. (credit - google play store)
అదే సమయంలో టిక్‌టాక్‌పై దేశంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఆ యాప్‌ని పూర్తిగా నిషేధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ యాప్‌లో మహిళలకు వ్యతిరేకంగా వీడియోలు వస్తున్నాయనీ, యాసిడ్ దాడుల్ని ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందువల్ల ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ రేటింగ్ 1.3కి పడిపోయింది. మిత్రాన్ యాప్ రేటింగ్ 4.7గా ఉంది. (credit - google play store)
ఇటీవలే వచ్చిన 8ఎంబీ సైజ్ ఉన్న మిత్రాన్కి గూగుల్ ప్లేస్టోర్‌లో రేటింగ్ పెరిగింది. ఐతే ఇందులో చాలా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని యూజర్లు తెలిపారు. వాటన్నింటినీ సరిచేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఐతే... మిత్రాన్కి సెక్యూరిటీ అంతగా లేదనే వాదనతో ఏకీభవించిన గూగుల్ ఇప్పుడు ప్లేస్టోర్ నుంచి తొలగించింది. (credit - google play store)
మిత్రాన్ యాప్ సృష్టించిన శివంక్ అగర్వాల్... సోర్స్ కోడ్‌ని తక్కువ రేటుకి కొని... దాన్లో ఎలాంటి మార్పులూ చెయ్యకుండానే యాప్ రూపొందించారంటున్న సైబర్ సెక్యూరిటీ నిపుణులు... ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారికి... ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. పాకిస్థాన్ కంపెనీ బొక్సస్ (Qboxus) నుంచి సోర్స్ కోడ్ టిక్ టిక్ (TicTic)ని కొన్న శివంక్... మార్పులు చెయ్యకుండా యధావిధిగా యాప్ తయారుచేశారు. సోర్స్ కోడ్‌లో మార్పులు చేసిన తర్వాతే వాడటం మంచిదంటున్నారు టెక్ నిపుణులు. ప్రజెంట్ ఆ యాప్ వాడితే... వ్యక్తిగత డేటాకి భద్రత ఉండదని చెబుతున్నారు. (credit - google play store)
పాకిస్థాన్... లాహోర్‌లోని బొక్సస్ కంపెనీ కూడా తాము ఇచ్చిన కోడ్‌లో మార్పులు చెయ్యాలనే తాము ఎప్పుడూ కోరతామని తెలిపింది. యాజ్ ఇట్ ఈజ్‌గా వాడమని ఎప్పుడూ, ఎవరికీ చెప్పలేదని వివరించింది. కానీ శివంక్ అగర్వాల్... ప్రైవసీ పాలసీని అప్లోడ్ చెయ్యకుండా యాప్ డెవలప్ చెయ్యడం అనేది యూజర్లకు సమస్యే అని తెలిపింది. (credit - google play store)
బొక్సస్ కంపెనీ... తాము తయారుచేసిన సోర్స్ కోడ్‌లో మిత్రాన్ యాప్ సోర్స్ కోడ్ చాలా మంచిదనీ, అదే బెస్ట్ కోడ్ అని తెలిపింది. ఈ కోడ్‌ని శివంక్ అగర్వాల్ రూ.2500కి కొన్నట్లు తెలిసింది. బొక్సస్ కంపెనీ... రకరకాల యాప్స్ తయారుచేస్తోంది. టిండర్, బాదూ లాంటి వాటికి సేమ్ కోడ్లు తయారుచేస్తోంది. (credit - google play store)
మిత్రాన్ యాప్‌కి సంబంధించి ప్రత్యేక సర్వర్ ఉంది. అందువల్ల మిత్రాన్ యూజర్లు ఇచ్చే వీడియో డేటాను పాక్‌లోని బొక్సస్ కంపెనీ పొందే అవకాశం లేదు. అయినప్పటికీ... సెక్యూరిటీ పరంగా మిత్రాన్ సరైనది మాత్రం కాదంటున్నారు. ఇప్పుడా యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసేయడంతో... దాన్ని వాడుతున్న యూజర్లు కూడా దాన్ని అన్-ఇన్స్టాల్ చేస్తున్నారని తెలిసింది. (credit - google play store)