గూగుల్... డిలీట్ చేసిన 11 యాప్స్‌లో ఇమేజ్ కంప్రెస్, రిలాక్సేషన్, ఆండ్రాయిడ్ SMS, చెర్రీ, సెండ్ SMS, లవింగ్, లవ్ మెసేజ్, విత్ మీ, HM వాయిస్, ఫ్రెండ్స్ SMS, రికవరీ ఫైల్స్, ఎల్ ప్లాకర్, రిమైండ్ మీ, మెమరీ గేమ్ ట్రైనింగ్ ఉన్నాయి. ఇవేవీ ప్రజలు పెద్దగా వాడే యాప్స్ కాదు. కానీ... వీటిని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లు చిక్కుల్లో పడ్డారు. ఈ యాప్స్ ఉన్నవాళ్లు డిలీట్ చేయాలని గూగుల్ కోరింది. ఈ జోకర్ మాల్వేర్ను సృష్టించిన వాళ్లు... తమను గుర్తించకుండా ఉండేందుకు చాలా పాత టెక్నిక్స్‌ను వాడుతున్నారు. జనరల్‌గా గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్‌కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ... ఈ జోకర్... ఆ సెక్యూరిటీని బ్రేక్ చేయగలుగుతోంది. దీన్ని కనిపెట్టడం గూగుల్ వల్ల కూడా కావట్లేదంటే... ఇది ఎంత డేంజరో ఆలోచించుకోండి.