Mobile Apps: వెంటనే ఈ 5 యాప్స్ మీ ఫోన్ నుంచి డిలిట్ చేయండి
Mobile Apps: వెంటనే ఈ 5 యాప్స్ మీ ఫోన్ నుంచి డిలిట్ చేయండి
Mobile Apps | మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా? ప్లేస్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? అందులో మీకు ఉపయోగపడే యాప్స్‌తో పాటు మీకు హాని చేసే యాప్స్ కూడా ఉంటాయి. మీరు ఈ 5 యాప్స్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే డిలిట్ చేయండి.
1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మరో 5 యాప్స్‌ని తొలగించింది. యాప్స్ ద్వారా అప్పులు ఇచ్చే యాప్స్ చాలానే ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఇలా అప్పులు ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి ఫైనాన్షియల్ రెగ్యులేటర్ లేకుండా కొన్ని యాప్స్ అప్పులు ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. అనుమతులు లేకుండా డిజిటల్ లెండింగ్ బిజినెస్ చేస్తున్న యాప్స్‌ను గూగుల్ తొలగించింది. ఇప్పటికే పాపులర్ అయిన డిజిటల్ లెండింగ్ యాప్స్ పేర్లను పోలి మరిన్ని యాప్స్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమయ్యాయి. కానీ వాటికి ఎలాంటి అనుమతులు లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. ఈ యాప్స్ యూజర్ల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ, అప్పులు తీర్చాలంటూ వేధింపులకు పాల్పడుతున్నట్టు తేలింది. దీంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి 5 డిజిటల్ లెడింగ్ యాప్స్‌ని తొలగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. Ok Cash, Go Cash, Flip Cash, ECash, SnapItLoan పేరుతో ఉన్న యాప్స్‌ను గూగుల్ తొలగించింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్‌ను 10 లక్షలకు పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. మీరు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసినట్టైతే వెంటనే వాటిని డిలిట్ చేయండి. ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్ డిలిట్ చేసినా ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు వాటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని మీ ఫోన్ నుంచి తొలగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఏవైనా యాప్స్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ప్రమోట్ చేస్తున్నట్టైతే స్థానిక నియమనిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వం అనుమతి లేకుండా యాప్స్ నిర్వహించడం చట్ట విరుద్ధం. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. గూగుల్ తొలగించిన ఈ 5 యాప్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటి కార్యాలయాల అడ్రస్, ఇతర వివరాలు కూడా సరిగ్గా లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఇందులో ఓ యాప్ అయితే డబ్బులు చెల్లించని కస్టమర్లను వేధించినట్టు కూడా తేలింది. ఓ అమ్మాయి డబ్బు చెల్లించలేకపోతే ఆమె నగ్న చిత్రాలు పంపించాలని ఓ డిజిటల్ లెడింగ్ యాప్ ఎగ్జిక్యూటీవ్ అడిగినట్టు ఓ స్క్రీన్ షాట్ కూడా వైరల్ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)