Google Apps: స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడేస్తున్నారా? ఈ 5 యాప్స్ ట్రై చేయండి

Google Digital Wellbeing Experiment | స్మార్ట్‌ఫోన్ ఈ రోజుల్లో ఓ అవసరం. కానీ మితిమీరి వాడుతుండటం వల్ల వ్యసనంగా మారుతోంది. అవసరం ఉన్నా, లేకపోయినా యాప్స్ ఎక్కువగా వాడుతుండటం వల్ల ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే సరిపోతుంది. ఈ సమయాన్ని తగ్గించడం కోసం డిజిటల్ వెల్‌బీయింగ్‌పై దృష్టిపెట్టింది గూగుల్. ఇందుకోసం ప్రత్యేకంగా 5 యాప్స్ రూపొందించింది. వాటి ఉపయోగాలేంటో తెలుసుకోండి.