1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో లభించిన ఆఫర్స్ కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో కొన్ని స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ (Google Pixel 4A) స్మార్ట్‌ఫోన్ ధరను ఈ సేల్‌లో భారీగా తగ్గించింది ఫ్లిప్‌కార్ట్.
2. గతేడాది గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.31,999. ఆ తర్వాత ఆఫర్స్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర కాస్త తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,999 ధరకే లభించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా రూ.2,000 ప్రీపెయిడ్ ఆఫర్ లభిస్తోంది.
5. గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 5.81 అంగుళాల ఫుల్ హెచ్డీ ఓలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్‌లో 12.2మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. హెచ్డీఆర్+, నైట్ సైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 3,140ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ బ్లాక్ కలర్లో మాత్రమే లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)