1. మీరు రోజూ బైక్ లేదా కార్ నడుపుతుంటారా? ట్రాఫిక్ లేదు కదా అని స్పీడ్‌గా వెళ్తుంటారా? మీరు స్పీడ్‌గా వెళ్లే విషయం ఒక్కోసారి పోలీసులు గుర్తించకపోవచ్చు కానీ... మీరు ఎంత స్పీడ్‌లో బండి నడుపుతున్నారో గూగుల్‌కు తెలుసు. అవును... గూగుల్ మిమ్మల్ని అంతలా ఫాలో అవుతూ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్‌లోని (Google Maps) ఓ ఫీచర్ స్పీడోమీటర్లా పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. గూగుల్ మ్యాప్స్‌ను అందరూ తమకు కావాల్సిన ప్రాంతాలు, అడ్రస్‌ల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. గూగుల్ మ్యాప్స్ స్పీడోమీటర్లా పనిచేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. వాహనం నడిపేవారు స్పీడ్ పెంచితే వెంటనే గూగుల్ అలర్ట్ చేస్తుంది. మీరు స్పీడ్ మిలిట్ దాటినట్టైతే గూగుల్ మ్యాప్స్ స్పీడోమీటర్ కలర్ కూడా మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడోమీటర్ ఫీచర్ ఆన్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో స్పీడోమీటర్ గుర్తు కనిపిస్తుంది. అందులో గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వాహనం వెళ్తుందో తెలుసుకోవచ్చ. గూగుల్ మ్యాప్స్ తొలిసారిగా 2019 లో ఆన్ స్క్రీన్ స్పీడోమీటర్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. మొదట ఆసియా, యూరప్, యూకే లాంటి దేశాల్లో రిలీజైన ఈ ఫీచర్... ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)