1. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించుకునే ఫీచర్స్‌లో కాల్ రికార్డింగ్ (Call Recording) ఫీచర్ ఒకటి. గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉండేది. కానీ ఆండ్రాయిడ్‌లో వచ్చిన అప్డేట్స్తో కాల్ రికార్డింగ్ సదుపాయం నిలిచిపోయింది. అయితే కాల్ రికార్డ్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్స్ (Third-Party Apps) ఉపయోగిస్తున్నారు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే త్వరలో ఈ అవకాశం కూడా ఉండదు. మే 11 నుంచి కాల్ రికార్డింగ్ సాధ్యం కాదు. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్ చేయలేరు. స్మార్ట్ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఉండదు. మే 11 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్ చేయడం సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే ఈ విషయాన్ని గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ డెవలపర్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ మార్పులు మే 11 నుంచి అమలులోకి రానున్నాయి. కాల్ రికార్డింగ్ కోసం ఉపయోగించే యాక్సెసబిలిటీ ఏపీఐకి యాక్సెస్ తొలగించబోతోంది గూగుల్. కాబట్టి థర్డ్ పార్టీ యూజర్లు కూడా కాల్ రికార్డింగ్ చేయడం సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. గూగుల్ గత కొన్నేళ్లుగా కాల్ రికార్డింగ్ విషయంలో అనేక చర్యలు తీసుకుంటోంది. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ స్ట్రాటజీలో భాగంగా కాల్ రికార్డింగ్ ఫీచర్ నిలిపివేస్తున్నట్టు ఆండ్రాయిడ్ 10 వర్షన్ రిలీజ్ చేసినప్పుడు గూగుల్ ప్రకటించింది. అయితే యాక్సెసబిలిటీ ఏపీఐ ద్వారా థర్డ్ పార్టీ యాప్స్ మాత్రం కాల్ రికార్డింగ్ ఫీచర్‌ని అందిస్తూనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. స్మార్ట్‌ఫోన్ యూజర్లు కూడా థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసి తమకు వచ్చే కాల్స్ రికార్డ్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తుల అనుమతి లేకుండా వారి కాల్ రికార్డ్ చేయడం ప్రైవసీకి విరుద్ధం కాబట్టి గూగుల్ చిక్కులు ఎదుర్కొంటోంది. పలు దేశాల్లో చట్టపరమైన సమస్యల్ని ఎదుర్కోవడం కోసం గూగుల్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరి ఎవరి నుంచైనా వచ్చే కాల్ రికార్డ్ చేయాలంటే ఏంటీ పరిస్థితి? దీనికి ఓ పరిష్కారం ఉంది. ఏదైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ కాల్ రికార్డర్ యాప్ ప్రీలోడెడ్‌గా ఇస్తే కాల్ రికార్డింగ్ ఫీచర్ పనిచేస్తుంది. ఇందుకోసం ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. షావోమీ, సాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో లాంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కాల్ రికార్డర్ ఫీచర్ బిల్ట్ ఇన్‌గా ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)