ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెబ్బ్రౌజర్లలో గూగుల్ క్రోమ్ (Google Chrome) టాప్ ప్లేస్‌లో ఉంది. డిజైన్, యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్లు, సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం గూగుల్ కంపెనీ క్రోమ్ వెబ్ బ్రౌజర్ ప్రైవసీ, సెక్యూరిటీని మరింత పటిష్టం చేసే ప్రయత్నాల్లో ఉంది. గూగుల్ తీసుకొస్తున్న ఫీచర్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
* ఒక్క ట్యాప్‌తో హిస్టరీ మాయం : ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేసిన కంటెట్‌కు మరింత ప్రైవసీ కల్పించేందుకు, ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌లకు ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ అథెంటికేషన్ యాడ్ చేసినట్లు గతవారం గూగుల్ ప్రకటించింది. ఇప్పుడు ప్రైవసీ లేయర్‌కు మరిన్ని ఫీచర్లు జోడిస్తోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు 15 నిమిషాల బ్రౌజింగ్ హిస్టరీని ఒక్క ట్యాప్‌లో తొలగించే సదుపాయం అందించనుంది.
Chromestory ప్రకారం.. వినియోగదారులు క్రోమ్ బ్రౌజర్లో బ్రౌజింగ్ హిస్టరీని సులభంగా తొలగించడానికి ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్‌ను గూగుల్ అందించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ అప్డేట్కు సంబంధించి గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫ్లాగ్‌ను రిపోర్ట్ ఉదహరించింది. ఇది యాప్ రాబోయే అప్డేట్లలో చివరి 15 నిమిషాల డేటాను త్వరగా డిలీట్ చేసే ఆప్షన్‌ను అందిస్తుంది.
* క్రోమ్‌లో క్విక్ డిలీట్ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలి? : క్రోమ్‌లో క్విక్ డిలీట్ ఆప్షన్‌ను ఎలా ఆన్ చేయాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులు బ్రౌజింగ్ హిస్టరీ డేటాను లేదా మొత్తం అకౌంట్ సెషన్ యాక్టివిటీని తొలగించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత, క్రోమ్‌లోని మూడు-చుక్కల ఓవర్‌ఫ్లో మెనూలో 'క్విక్ డిలీట్' ఆప్షన్ కనిపిస్తుంది.
కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి, ఇన్‌కాగ్నిటో మోడ్ ఉపయోగించడం మర్చిపోయిన వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. వినియోగదారులు వేరొకరి ఫోన్లో Chromeని ఉపయోగిస్తుంటే, వారికి సెర్చింగ్ గురించి తెలియకూడదని భావిస్తే కూడా ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా సెర్చింగ్ హిస్టరీలో ఒక్కో లింక్‌ను డిలీట్ చేసే శ్రమ తప్పుతుంది.
* ఇప్పుడు బ్రౌజర్‌కు అదే ఆప్షన్ : క్విక్ డిలీట్ అనే ఆలోచన కొత్తది కాదు. 2021లో గూగుల్ యాప్ ద్వారా 15 నిమిషాల అకౌంట్ హిస్టరీని తొలగించే సామర్థ్యాన్ని Google ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ను 2022 మొదటి కొన్ని నెలల్లో Android యూజర్ల కోసం లాంచ్ చేసింది. సెర్చ్ హిస్టరీ, ఇతర అకౌంట్ యాక్టివిటీస్‌ను ఇన్‌స్టంట్‌గా తొలగించే సదుపాయం అందించింది.
ఇప్పుడు గూగుల్ ఇదే ఫీచర్‌ను క్రోమ్ బ్రౌజర్‌కు కూడా యాడ్ చేయాలనే ప్లాన్‌లో ఉంది. అదే విధంగా గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు అప్‌గ్రేడెడ్ సేఫ్టీ చెక్స్, సేఫ్ బ్రౌజింగ్ వంటి ఫీచర్లను అందించింది. ఇందులో భాగంగా ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌కి బయోమెట్రిక్ తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే ఇన్‌కాగ్నిటో మోడ్ ఆన్ చేయాలన్నా? ఆఫ్ చేయాలన్నా? ఫింగర్‌ప్రింట్ తప్పని సరిగా అవసరం.