1. ఓ లేటెస్ట్ టెక్ రిపోర్ట్ ప్రకారం, క్రోమ్ ఒక అడ్వాన్స్డ్ స్క్రీన్‌షాట్ టూల్ (Screenshot Tool)ను విండోస్ 11, విండోస్ 10, మ్యాక్ఓఎస్, క్రోమ్ఓఎస్ యూజర్లకు తీసుకొస్తోంది. క్రోమ్ బీటా వెర్షన్‌లోని కొత్త టూల్స్ లో ఈ స్క్రీన్‌షాట్ టూల్ కనిపించింది. దీని సహాయంతో వెబ్ పేజీలను స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. సర్కిల్స్, స్క్వేర్స్, లైన్స్ ఇలా వివిధ షేపులు వెబ్సైట్ పేజీ స్క్రీన్‌షాట్ పై పేస్ట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆర్బీఐ యాప్స్, ఇన్స్టంట్ పర్సనల్ లోన్ యాప్స్, పర్సనల్ లోన్ యాప్స్, ఫేక్ లోన్ యాప్స్, వ్యక్తిగత రుణాలు" width="1200" height="800" /> 3. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో మీరు ఇప్పటికే యూజ్ చేసి ఉన్నట్లయితే క్రోమ్ కొత్తగా తీసుకొస్తున్న అడ్వాన్స్డ్ స్క్రీన్‌షాట్ టూల్ ఎలా పని చేస్తుందో తెలుస్తుంది. మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగదారు అయితే, బ్రౌజర్లోని నిర్దిష్ట ప్రాంతాలను క్యాప్చర్ చేయడానికి.. స్నాప్‌ను క్లిప్‌బోర్డ్‌కి కాపీ చేయడానికి లేదా విండోస్ ఇంక్‌ని ఉపయోగించి ఎడిట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఈజీ 'వెబ్ క్యాప్చర్' టూల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Neowin అనే ప్రముఖ టెక్నాలజీ వెబ్సైట్ షేర్ చేసిన నివేదిక ప్రకారం, గూగుల్ దాని క్రోమ్ బ్రౌజర్ కోసం మెరుగైన ఇన్-బిల్ట్ స్క్రీన్‌షాట్ ఎడిటర్‌ను తీసుకు వచ్చే పనిలో ఉంది. ఈ కొత్త టూల్ కానరీ (Canary) అనే క్రోమ్ బీటా వెర్షన్లో కనిపిస్తుంది. కానరీ అంటే బీటా వెర్షన్లో కొత్తగా వచ్చిన టూల్స్ అని అర్థం. దీనిని మీరు https://www.google.com/intl/en_in/chrome/canary/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత chrome://flags కి వెళ్లి "డెస్క్‌టాప్ స్క్రీన్‌షాట్స్", "డెస్క్‌టాప్ స్క్రీన్‌షాట్స్ ఎడిట్ మోడ్" ఫ్లాగ్‌లను ఎనేబుల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేసి ఏదైనా వెబ్‌పేజీని తెరిచి మెనూ బార్‌లోని షేర్ బటన్‌ను క్లిక్ చేసి స్క్రీన్‌షాట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత పోస్ట్-స్క్రీన్‌షాట్ ప్రివ్యూలో ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిటర్‌తో కొత్త ట్యాబ్‌ను క్రోమ్ తెరుస్తుంది. అక్కడ మీరు మీకు కావాల్సినట్టుగా స్క్రీన్‌షాట్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ ఆప్షన్స్ బట్టి చూస్తుంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కంటే గూగుల్ క్రోమ్ మెరుగైన స్క్రీన్‌షాట్ టూల్ తీసుకొస్తుందని తెలుస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ క్యాప్చర్ స్క్రీన్‌షాట్ టూల్ యూజర్లు స్క్రీన్‌షాట్ తీయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవడానికి మాత్రమే అనుమతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్‌ఫోన్ టిప్స్" width="1200" height="800" />
8. క్రోమ్ లోని కొత్త టూల్ మాత్రం సర్కిల్లు, స్క్వేర్స్, యారోస్, లైన్స్ వంటి వివిధ మార్గాల్లో జోడించడానికి... పరిమాణాన్ని మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాదు, కలర్, స్టైల్ కస్టమైజ్ చేసుకోవడానికి థిక్ నెస్, బ్రష్‌లు, స్మైలీలు, టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా మీకు టూల్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)