1. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ నడుస్తోందని చెప్పవచ్చు. రెండు కంపెనీలు ఏఐ టెక్నాలజీపై భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. పోటాపోటీగా చాట్బాట్లను తీసుకొస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ద్వారా మైక్రోసాఫ్ట్ రూపొందించిన చాట్‌జీపీటీ చాట్‌బాట్‌కి పోటీగా గూగుల్ ‘బార్డ్’ అనే ఏఐ చాట్‌బాట్ ఇంట్రడ్యూస్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీకి ఆదరణ పెరుగుతున్న క్రమంలో గూగుల్ ‘బార్డ్’ చాట్‌బాట్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్యారిస్‌లో ఈ ‘బార్డ్’ లాంచ్ ముందు ప్రదర్శించిన వీడియోలో ఓ తప్పు దొర్లింది. దీంతో ‘బార్డ్’ పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యవస్థల వల్ల బడా కార్పొరేషన్లకు సమగ్రత(Integrity)కే ముప్పు పొంచి ఉందనే సూచనలు వెలువడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ‘బార్డ్’ ఏఐ సర్వీస్‌ని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని గూగుల్ సంకల్పంతో ఉంది. అయితే, ముందుగా రూపొందించిన ప్రమోషనల్ వీడియోలో ‘బార్డ్’ ఓ ప్రశ్నకు కచ్చితమైన సమాచారాన్ని అందించకపోవడంతో దీని పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్యారిస్‌లో ‘బార్డ్’ లాంచ్ ఈవెంట్‌కి కొన్ని గంటల ముందు ‘రాయిటర్స్’ ఏజెన్సీ ఈ తప్పును గుర్తించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ‘బార్డ్’ ప్రమోషనల్ వీడియోలో సంపూర్ణ, కచ్చితమైన సమాధానం ఇవ్వలేదని రాయిటర్స్ తెలిపింది. ఇందులో ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి పుట్టకొచ్చిన కొత్త ఆవిష్కరణల గురించి ఓ తొమ్మిదేళ్ల విద్యార్థికి ఏం చెప్పాలి’ అనే ప్రశ్నను అడగగా.. పాలపుంత ఆవల ఉన్న గ్రహాల చిత్రాలు తీయడానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఉపయోగించేవారని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ సమాధానం సరైంది కాదని రాయిటర్స్ గుర్తించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ‘బార్డ్’ సూచించిన సమాధానం సరైంది కాదంటూ రాయిటర్స్ గుర్తించడంతో అది కంపెనీపై ప్రభావం చూపింది. నాస్డాక్ స్టాక్ మార్కెట్లో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ షేర్లు ఉన్నట్టుండి పడిపోయాయి. మొత్తం కంపెనీ విలువలో 7.8శాతం మేర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ మొత్తం 100 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే, కంపెనీ మార్కెట్ విలువ పడిపోవడమే కాకుండా, యూజర్లకు ‘బార్డ్’ పనితీరుపై అనుమానాలు కలిగేందుకు ఈ ఘటన కారణమైంది. ఈ ఏఐ చాట్‌బోట్ వల్ల కంపెనీ ఇంటిగ్రిటీ దెబ్బతినే ప్రమాదం ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. టెక్నాలజీలో సరికొత్త విప్లవమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్బాట్లు. ప్రస్తుతమున్న సెర్చ్ ఇంజిన్లతో పోలిస్తే ఈ చాట్బోట్లు మెరుగ్గా సేవలు అందించగలవు. యూజర్లకు పూర్తి సమాచారాన్ని, అత్యంత సులువైన పద్ధతిలో చేరవేస్తాయి. ఒక ప్రశ్నకు సమాధానం రాసినట్లుగా అన్ని అంశాలను సంగ్రహించి యూజర్‌కు చూపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. అందుకే మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ రాగానే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రమాదంలో పడుతుందనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అయితే, గూగుల్ కూడా త్వరగా మేల్కొని చాట్‌జీపీటీకి పోటీగా ‘బార్డ్’ని తీసుకొస్తుండటం గమనార్హం. ఈ ఏఐ టెక్నాలజీని బిజినెస్‌లోనూ, ఉద్యోగులకు బదులుగా వినియోగించే వీలుంటుంది. అయితే, ప్లాజియారిసమ్, కచ్చితమైన సమాచారం అందించడం వంటి సవాళ్లపై చాట్బాట్లు దృష్టి సారించాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)