ఆండ్రాయిడ్ మాల్వేర్, ఆక్టో మాల్వేర్, ప్లేస్టోర్, మాల్వేర్ యాప్స్, టిప్స్" width="1200" height="800" /> 1. ఆండ్రాయిడ్(Android), iOSలో గూగుల్ యాప్‌ను(Google Apps) సెర్చింగ్కే కాకుండా వివిధ రకాల సేవలు పొందడానికి కూడా వినియోగించవచ్చు. గూగుల్ యాప్‌తో మనకు అందుబాటులో ఉండే 11 హిడెన్ ఫీచర్స్ ఇవే.. ఇప్పుడు Google లెన్స్‌లో మల్టీ సెర్చ్ ఆప్షన్ ద్వారా ఒకే సమయంలో టెక్స్ట్ , ఇమేజెస్ ఉపయోగించి సెర్చ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఫోన్లో Google యాప్‌ను ఓపెన్ చేసి, లెన్స్ కెమెరా ఐకాన్‌ను క్లిక్ చేయాలి. స్క్రీన్షాట్లలో ఒకదానిని అప్లోడ్ చేసి సెర్చ్ చేయడం, లేదా ఫోటో తీసి అప్లోడ్ చేయడం చేయవచ్చు. ఆ తర్వాత + పై క్లిక్ చేసి టెక్స్ట్‌ను యాడ్ చేయవచ్చు. Google యాప్‌లో సెర్చ్ చేయడానికి వాయిస్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం యాప్‌లో మైక్ ఐకాన్‌ను నొక్కి, Googleలో మీ ప్రశ్నను చెప్పాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. గూగుల్ అసిస్టెంట్‌తో క్యాలెండర్ ఈవెంట్లు, రాబోయే సమావేశాల వంటి క్యాలెండర్ అప్డేట్లను సృష్టించవచ్చు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే హెచ్చరించడానికి నోటిఫికేషన్లను కూడా సెట్ చేయవచ్చు. ఫోన్ లేదా ఏదైనా డివైజ్ నుంచి Google లెన్స్‌తో చేతితో రాసిన అక్షరాలను కాపీ చేసి అదే అకౌంట్‌తో లాగిన్ అయిన మరో డివైజ్‌లో పేస్ట్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Google యాప్‌లో గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్‌ని ఉపయోగించి కాల్లు చేయవచ్చు, టెక్స్ట్ మెసేజ్‌లు పంపవచ్చు. Google యాప్‌తో త్వరగా ట్రాన్సాక్షన్లు జరపడానికి అడ్రెస్, చెల్లింపుల వివరాలు సేవ్ చేసి ఆటోఫిల్ చేయవచ్చు. Google యాప్ వినియోగదారులకు కొత్త అంశాలను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. సంక్లిష్ట సమస్యలను విభజించడం ద్వారా అర్థం చేసుకొనేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)