1. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని వాట్సప్ రూపొందిస్తోంది. అందులో రెండు ఫీచర్స్‌ని (WhatsApp Features) త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు రిలీజ్ చేయనుంది. డిలిట్ చేసిన మెసేజెస్‌ని తిరిగి పొందడం కోసం ఓ ఫీచర్ రూపొందిస్తే, గ్రూప్‌లో ఎవరి మెసేజ్‌నైనా డిలిట్ చేసే అధికారం గ్రూప్ అడ్మిన్లకు ఇవ్వడం మరో ఫీచర్. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించే WABetaInfo అందిస్తున్న వివరాల ప్రకారం ఐఓఎస్ బీటా 22.18.0.70. వర్షన్లో ఈ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సప్ బీటా యూజర్లు తమ యాప్ అప్డేట్ చేసి ఈ ఫీచర్స్ ఉపయోగించవచ్చు. ఎవరైనా వాట్సప్‌లో మెసేజ్ డిలిట్ చేస్తే ఆ మెసేజ్ తిరిగి పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే వాట్సప్ యూజర్లు delete for me ఆప్షన్ ఎంచుకొని మెసేజ్ డిలిట్ చేస్తేనే తిరిగి పొందడం సాధ్యం. ఒకవేళ delete for everyone ఆప్షన్ ద్వారా ఆ మెసేజ్ డిలిట్ చేసినట్టైతే ఇక దాన్ని తిరిగి పొందడం సాధ్యం కాదు. అయితే డిలిట్ చేసిన ఎన్ని రోజుల వరకు ఈ ఫీచర్ పనిచేస్తుందన్న స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకే అందుబాటులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక దీంతో పాటు వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు తాము మేనేజ్ చేస్తున్న గ్రూప్‌లో ఏ యూజర్ పోస్ట్ చేసిన మెసేజ్‌నైనా డిలిట్ చేయొచ్చు. గ్రూప్ అడ్మిన్లకు వాట్సప్ నుంచి లేటెస్ట్గా లభించిన అధికారం ఇది. ఈ ఫీచర్ కూడా వాట్సప్ ఐఓఎస్ యూజర్లకు రిలీజ్ చేసింది. మీకు ఈ ఫీచర్ వచ్చిందో లేదో గ్రూప్‌లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూప్‌లో ఏదైనా మెసేజ్‌పైన లాంగ్ ప్రెస్ చేయాలి. అందులో delete for everyone ఆప్షన్ కనిపిస్తే మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టే. వాట్సప్ గ్రూప్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన మెసేజెస్ చేస్తే మీరే స్వయంగా వాటిని డిలిట్ చేయొచ్చు. ఆ మెసేజ్ డిలిట్ చేయాలని సదరు యూజర్‌ను కోరాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇప్పటికే ఈ ఫీచర్ Slack లో కూడా ఉంది. అయితే స్లాక్‌లో గ్రూప్ అడ్మిన్ ఎవరికీ తెలియకుండా మెసేజ్ డిలిట్ చేయొచ్చు. కానీ వాట్సప్‌లో మాత్రం గ్రూప్ అడ్మిన్ ఎవరి మెసేజ్‌నైనా డిలిట్ చేస్తే this message has been deleted by a group admin అనే మెసేజ్ కనిపిస్తుంది. అంటే గ్రూప్ అడ్మిన్ ఈ మెసేజ్ డిలిట్ చేసినట్టు అందరికీ తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)