1. వాట్సాప్ కంపెనీ కొన్ని నెలలుగా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు వరుస అప్డేట్లను అందిస్తోంది. యూజర్ల సంఖ్య పెంచుకోవడంపై, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించడంపై దృష్టిపెట్టంది. లేటెస్ట్గా వాట్సాప్ (WhatsApp) అందించిన అప్డేట్లలో వ్యూ వన్స్ ఫీచర్ కూడా ఉంది. మొదట ఈ ఫీచర్‌ను ఫొటోలు, వీడియోల కోసం మాత్రమే లాంచ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే త్వరలో స్టాండర్డ్ టెక్స్ట్ బేస్డ్ మెసేజ్‌లకు కూడా వ్యూ వన్స్ (View Once Feature) ఫీచర్‌ను ఎక్స్టెండ్ చేసే ప్రయత్నాల్లో వాట్సాప్ కంపెనీ ఉన్నట్లు తెలిసింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ తాజా బీటా వెర్షన్లో డెవలప్మెంట్ ఫీచర్ ఎవిడెన్స్‌ను కనుగొన్నట్లు WABetaInfo ఓ నివేదికలో పేర్కొంది. ఈ అప్డేట్ను వాట్సాప్ లాంచ్ చేస్తే.. ఇతరులు చదవగానే మెసేజ్‌లు చాట్ విండో నుంచి మాయమైపోయేలా యూజర్లు టెక్స్ట్‌ను సెండ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా ఫొటోలు లేదా వీడియోలు ఎవరికైనా సెండ్ చేస్తే.. వారి గ్యాలరీలో మీడియా సేవ్కాదు. వాళ్లు ఒక్కసారి మాత్రమే సెండ్ చేసిన ఫైల్స్‌ను చూడగలుగుతారు. అదే విధంగా ఆ ఫైల్స్‌ను ఫార్వాడ్ చేసే అవకాశం ఉండదు. సేవ్ చేయలేరు, స్టార్ మెసేజ్లుగా కూడా సెలక్ట్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీరు ఫైల్స్ పంపుతున్న వ్యక్తి ఫోన్లో రీడ్ రెసీప్ట్స్ ఆన్‌లో ఉంటేనే వ్యూ వన్స్ మెసేజ్ ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. ఫోటో లేదా వీడియోని పంపిన 14 రోజుల వరకు ఓపెన్ చేయకపోతే.. మీడియా చాట్ నుంచి ఎక్స్పైర్ అయిపోతుంది. బ్యాకప్ సమయానికి వ్యూ వన్స్ మెసేజ్ ఓపెన్ చేయకపోతే.. బ్యాకప్ నుంచి మీడియాను రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎక్కువ కాలం ఎదుటివారికి అందుబాటులో ఉండకూడదని భావించే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను వ్యూ వన్స్ ఫీచర్లో సెండ్ చేయవచ్చు. పాస్వర్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి వాటిని భవిష్యత్తులో వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా సెండ్ చేయవచ్చు. వాట్సాప్ ఫోటోలు, వీడియోలకు వ్యూ వన్స్ లాంచ్ చేసినప్పుడు.. ఎవరికైనా Wi-Fi లాగిన్ వివరాల ఫోటోను పంపిన ఉదాహరణను పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. వాట్సాప్ ఇప్పటికే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ చాట్‌లోని ప్రతి మెసేజ్‌ను నిర్ణీత వ్యవధి తర్వాత డిసప్పియర్ చేస్తుంది. ఎంత కాలానికి డిసప్పియర్ అవ్వాలనే ఆప్షన్‌ను సెట్టింగ్స్‌లో సెట్ చేయవచ్చు. అయితే వ్యూ వన్స్ ఫీచర్ చాట్ విండోలోని మొత్తం డేటాను కాకుండా.. కేవలం వ్యూ వన్స్ మోడ్‌లో పంపిన వాటిని మాత్రమే తొలగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్లో మరో కొత్త ఆప్షన్‌ను అందజేసింది. వ్యూ వన్స్ ఫీచర్లో పంపిన మీడియాను స్క్రీన్‌షాట్ తీసే అవకాశం ఉండదు. అదే విధంగా ఈ ఆప్షన్‌ను టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా అప్లై చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. అయితే WhatsApp ప్రతినిధి రాబోయే ఫీచర్‌కు సంబంధించి WABetaInfo నివేదికపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. (ప్రతీకాత్మక చిత్రం)