1. వాట్సప్ యూజర్లకు శుభవార్త. వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. రియాక్షన్స్ ఫీచర్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది వాట్సప్. టెలిగ్రామ్, ఐమెసేజ్ లాంటి ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కోసం వాట్సప్ యూజర్ల కోసం రియాక్షన్స్ ఫీచర్‌ను (WhatsApp Reactions Feature) యూజర్లకు రిలీజ్ చేస్తోంది వాట్సప్. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్‌ను ఇవాళ్టి నుంచే అందించబోతున్నట్టు మెటా ప్లాట్‌ఫామ్స్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రకటించారు. వాట్సప్ నుంచి వచ్చిన అతిపెద్ద ప్రకటన ఇది. వాట్సప్ ఈ ఫీచర్‌ను చాలాకాలంగా పరీక్షిస్తోంది. బీటా టెస్టర్స్ పరీక్షించిన తర్వాత ఇతర యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. (image: Instagram / Mark Zuckerberg)
3. వాట్సప్‌లో మొదట ఎమోజీతో రియాక్షన్స్ ఫీచర్‌ను టెస్ట్ చేశారు. ఈ ఫీచర్లో ఆరు రకాల రియాక్షన్స్ అందుబాటులో ఉంటాయి. లైక్, లవ్, లాఫ్, సర్ప్రైజ్, సాడ్, థ్యాంక్స్ ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. వాట్సప్‌లో ఏదైనా మెసేజ్‌కి మీ రియాక్షన్‌ని వీటి ద్వారా తెలపడానికి వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. వాస్తవానికి వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్‌ను 2018 నుంచి పరీక్షిస్తోంది వాట్సప్. కానీ గతేడాది ఫైనల్ టెస్టింగ్‌కు వచ్చింది. గత నెలలో వాట్సప్ గ్రూప్స్‌ని కలుపుతూ వాట్సప్ కమ్యూనిటీస్ రూపొందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. అప్పుడే త్వరలో వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)