1. మెటా ఆధ్వర్యంలోని ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫారం వాట్సాప్ వరుసగా కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వాట్సాప్ యూజర్ల డేటా లీకేజీపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టిన కంపెనీ.. లేటెస్ట్ అప్డేట్లను అందించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుతం వాట్సాప్ వీడియో కాల్లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ అందించేందుకు పనిచేస్తోంది. వాట్సాప్‌లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఇతర యాప్‌లను ఉపయోగించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అదే విధంగా భవిష్యత్తులో మరో 21 కొత్త ఎమోజీలను అందించే ప్రయత్నాల్లో వాట్సాప్ ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఇప్పటికే యాప్‌లో కనిపించిన ఎనిమిది ఎమోజీలను కూడా రీడిజైన్ చేసింది. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న తాజా బీటా బిల్డ్ ప్రకారం.. ఎనిమిది ఎమోజీలు అప్డేట్ అయ్యాయి. అదే విధంగా మేకింగ్‌లో ఉన్న కొత్త 21 ఎమోజీలు త్వరలో బీటా వెర్షన్లో అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ క్రమంలోనే వాట్సాప్ కంపెనీ డిసప్పియరింగ్ మెసేజెస్ షార్ట్‌కట్ బటన్‌ను టెస్ట్ చేయడం ప్రారంభించింది. కంపెనీ తన కొన్ని ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం ఈ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్డేట్లో వాట్సాప్ బీటాలో దాని లేటెస్ట్ డిసప్పియరింగ్ సెక్షన్‌ని రీడిజైన్ చేయడానికి కృషి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త, పాత చాట్లను డిసప్పియరింగ్ థ్రెడ్‌లుగా గుర్తించడానికి వీలుగా ఈ ఫీచర్‌ను రూపొందించింది. అంతేకాకుండా డిసప్పియరింగ్ మెసేజెస్ సెక్షన్ అందించే 2.22.25.10 అప్డేట్ మరింత మంది టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, మెసేజింగ్ యాప్ దాని డిసప్పియరింగ్ మెసేజ్స్ ఫీచర్ కోసం అదనపు ఎంట్రీ పాయింట్‌ను లాంచ్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. WABetaInfo నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ (2.22.25.11 వెర్షన్) అప్డేటెడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత కొంతమంది టెస్టర్లు కొత్త ఫీచర్‌కు యాక్సెస్ పొందారు. కొత్త షార్ట్‌కట్ ఫీచర్‌ని మేనేజ్ స్టోరేజ్ సెక్షన్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. దీనిని స్పేస్-సేవింగ్ టూల్‌గా పేర్కొంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ కొత్త సెక్షన్ ఉపయోగించిన తర్వాత కొత్త, పాత చాట్లను ‘డిసప్పియరింగ్ థ్రెడ్లు’గా గుర్తించడం సులభం అవుతుంది. అంతేకాకుండా వినియోగదారులు అవసరంలేని మీడియా ఫైల్స్‌ను ఆటోమేటిక్‌గా తొలగించడానికి టైమర్‌తో డిసప్పియరింగ్ మెసేజెస్ను సెట్ చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. వినియోగదారులు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌లో లేదా చాట్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసి ఈ ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసే ఆప్షన్‌ను పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. వాట్సాప్ కొంతమంది వినియోగదారులను ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో తమ వాట్సాప్ అకౌంట్ ఉపయోగించే అవకాశం కల్పిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. BGR నివేదిక ప్రకారం.. ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ బీటా టెస్టర్లను వారి WhatsApp అకౌంట్‌ను రెండవ డివైజ్ అంటే టాబ్లెట్‌తో లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)