ఇండియాలో ఐఫోన్ ఎస్ఈ 3 ధర
ఐఫోన్ ఎస్ఈ 3 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,900 కాగా 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ రూ.48,900, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ కాస్ట్ రూ.58,900గా ఉంది. యాపిల్ అధికారిక ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతో పాటు అమెజాన్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ వంటి చాలా రిటైలర్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఫోన్ ఎస్ఈ 3 ఆఫర్
యాపిల్ ఫోన్స్ విక్రయించే ఇండియా ఐస్టోర్ (India iStore) కంపెనీ ఐఫోన్ ఎస్ఈ 3ని ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు... కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై రూ.2,000 క్యాష్‌బ్యాక్‌తో విక్రయిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.41,900కి దిగివస్తోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో పాటు https://www.indiaistore.com/iphone-13 సైట్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)