1. భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై (Free Wifi) అందించేందుకు భారతీయ రైల్వే (Indian Railways) కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఉబర్ని రైల్వే స్టేషన్లో వైఫై ఏర్పాటు చేయడంతో ఈ ఘనత సాధించింది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2. దేశంలోని 6100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై వాడుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అతిపెద్ద టెలికాం మౌలిక సదుపాయాల ప్రొవైడర్లలో ఒకటైన రైల్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు కాశ్మీర్‌లోని 15 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. డిజిటల్ ఇండియా ఇనీషియేటీవ్లో భాగంగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందించే ప్రాజెక్ట్‌ను రైల్వే మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్‌కు అందించడం విశేషం. హాల్ట్ స్టేషన్స్ మినహా దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో 100 శాతం కవరేజీకి దగ్గరగా వచ్చింది. ఇంకొన్ని రైల్వే స్టేషన్లలో మాత్రమే ఉచిత వైఫై అందుబాటులోకి రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. భారతదేశంలో 7,000 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని హాల్ట్ రైల్వే స్టేషన్స్ ఉంటాయి. హాల్ట్ రైల్వే స్టేషన్స్ మినహాయించి మిగతా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది రైల్‌టెల్. ప్రస్తుతం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. అందులో 5,000 పైగా రైల్వే స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆ తర్వాత రైల్‌వైర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వైఫై ఉపయోగించుకోవచ్చు. ప్రతీ రోజు 30 నిమిషాల పాటు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వాడుకోవాలంటే ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఒక రోజులో 5జీబీ వాడుకోవాలంటే రూ.10, ఒక రోజులో 10జీబీ డేటాకు రూ.15, ఐదు రోజుల్లో 10జీబీ డేటాకు రూ.20, ఐదు రోజుల్లో 20జీబీ డేటాకు రూ.30, పది రోజుల్లో 20జీబీ డేటాకు రూ.40, పది రోజుల్లో 30జీబీ డేటాకు రూ.50, నెల రోజుల్లో 60జీబీ డేటాకు రూ.75 చెల్లించాలి. నెట్‌బ్యాంకింగ్, వ్యాలెట్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. 34ఎంబీపీస్ స్పీడ్‌తో వైఫై వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)