పబ్జీ.. ఈ గేమ్ అంటే చాలు అనేక మంది చిన్నారులు, యువకులు పడి చస్తారు. ఈ ఆటకు బానిసై పిచ్చోళ్లు అయిన వారు, ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ చైనా గేమ్ ను గత సంవత్సరం సెప్టెంబర్ 2న భారత ప్రభుత్వం నిషేధించింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కేవలం పబ్ జీ ని మాత్రమే కాదు అనేక చైనా యాప్ లపై సర్కార్ వేటు వేసింది. ఈ చర్య అనేక మంది పబ్ జీ ప్రియులను నిరాశకు గురి చేసింది. మళ్లీ దేశంలోకి పబ్ జీ ఎప్పుుడెప్పుడు వస్తుందా? అన్న ఆశతో వారంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
పబ్జీ సంస్థ కూడా తాము మళ్లీ ఇండియాలో వస్తామంటూ సంకేతాలను ఇస్తోంది. అయితే తాజాగా పబ్జీ మాతృ సంస్థ పబ్జీ పేరును ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ గా మార్చుతూ నూతన పోస్టర్లను విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ పోస్టర్లను పబ్జీ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో పబ్జీ మళ్లీ భారత్ లోకి వస్తుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అటు పబ్ జీ కూడా భారత దేశంలో తిరిగి తమ గేమ్ ను ప్రారంభించేందుకు నియామకాలను సైతం చేపట్టింది. వారం క్రితం గవర్నమెంట్ రిలేషన్ మేనేజర్ పోస్ట్‌కు సంస్థ రిక్రూట్ మెంట్ నిర్వహించింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
పీఎం కేర్స్‌కు పబ్జీ సంస్థ రూ.1.5 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పబ్ జీ దేశంలోకి వళ్లీ రావడం ఖాయమని ఆ ఆట ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)