1. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే సుమారు రూ.40,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రీమియం స్మార్ట్ఫోన్ల విషయంలో యాపిల్ తర్వాత వన్‌ప్లస్ కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆ తర్వాత వన్‌ప్లస్ కాస్త తక్కువ బడ్జెట్లో స్మార్ట్ఫోన్లను పరిచయం చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా నార్డ్ సిరీస్‌ను రిలీజ్ చేసింది. 2020 లో వన్‌ప్లస్ నార్డ్ మొబైల్‌ను రిలీజ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆ తర్వాత వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2), వన్‌ప్లస్ నార్డ్ సీఈ (OnePlus Nord CE) మోడల్స్‌ను రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నెంబర్ సిరీస్ కన్నా నార్డ్ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధర తక్కువ. కేవలం రూ.30,000 లోపే నార్డ్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తోంది వన్‌ప్లస్. త్వరలో వన్‌ప్లస్ నుంచి రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.22,999 మాత్రమే. ఇక వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.27,999. తక్కువ బడ్జెట్లోనే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్‌గా ఉంటున్నాయి. అయితే రూ.20,000 లోపు సెగ్మెంట్లో కూడా అడుగుపెట్టే ఆలోచనలో వన్‌ప్లస్ ఉన్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ బడ్జెట్లో కూడా నార్డ్ సిరీస్‌లోనే స్మార్ట్‌ఫోన్ రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంటాయి. కానీ వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉండొచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
7. వన్‌ప్లస్ నార్డ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉండొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)