1. టాటా స్కై యూజర్లకు శుభవార్త. అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది టాటాస్కై. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్నవారితో పాటు కొత్తగా డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి ఆఫర్స్ ప్రకటించింది. సెట్ టాప్ బాక్స్ నుంచి రీఛార్జ్ వరకు అనేక ఆఫర్స్ ప్రకటించింది. ఎంచుకునే ఆఫర్స్‌కు తగ్గట్టుగా బెనిఫిట్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. టాటా స్కై బింజ్+ సెట్ టాప్ బాక్స్ తీసుకునేవారికి ప్రీమియం యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా అందిస్తోంది. సెట్ టాప్ బాక్సులపై రూ.400 వరకు డిస్కౌంట్, రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ప్రకటించింది. మరి కొత్తవారితో పాటు ప్రస్తుత టాటాస్కై యూజర్లు ఈ ఆఫర్స్ ఎలా పొందాలో, వారికి ఎలాంటి ఆఫర్స్ వర్తిస్తాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Tata Sky Binge+ Set-Top Box: టాటాస్కై బింజ్+ సెట్‌టాప్ బాక్స్ అసలు ధర రూ.5,792. కానీ ఆఫర్ ధర రూ.2,499 మాత్రమే. ప్రస్తుత టాటా స్కై సబ్స్క్రైబర్లు బింజ్+ సెట్‌టాప్ బాక్స్‌ను రూ.1,999 చెల్లించి పొందొచ్చు. ఈ సెట్ టాప్ బాక్స్ తీసుకుంటే డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం, సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్, క్యూరియాసిటీస్ట్రీమ్, వూట్ కిడ్స్, ఎరోస్ నౌట్, సన్నెక్స్ట్, హంగామా ప్లే, షెమారూమీ లాంటి 10 ప్రీమియం యాప్స్ ఒక నెల సబ్స్క్రిప్షన్ ఉచితం. మూడు నెలలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా పొందొచ్చు. ఇక TSKY200 ప్రోమో కోడ్ ఉపయోగిస్తే అదనంగా రూ.200 తగ్గింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Tata Sky HD Set-Top Box: టాటా స్కై హెచ్డీ సెట్‌టాప్ బాక్స్ అసలు ధర రూ.1,599. ఆఫర్ ధర రూ.1,499. 500 పైగా ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. దీంతో పాటు టాటా స్కై కుకింగ్, టాటా స్కై ఫిట్నెస్, టాటా స్కై మ్యూజిక్, టాటా స్కై సీనియర్స్ లాంటి టాటా స్కై సర్వీసెస్ యాక్సెస్ చేయొచ్చు. TSKY150 ప్రోమో కోడ్ ఉపయోగిస్తే రూ.150 డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Tata Sky Recharge Offers: ఇక టాటా స్కై రీఛార్జులపైనా ఆఫర్స్ ఉన్నాయి. టాటా స్కై స్పెషల్ ఆఫర్లో భాగంగా 12 నెలల పాటు రీఛార్జ్ చేస్తే ఒక నెల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. టాటా స్కై పోర్టల్ లేదా టాటా స్కై మొబైల్ యాప్‌లో రీఛార్జ్ చేస్తే ఫ్రీ కూపన్స్ కూడా వస్తాయి. ఫ్రీఛార్జ్లో రూ.200 రీఛార్జ్ చేస్తే రూ.20 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొబీక్విక్తో రూ.300 పైన ఎంతైనా రీఛార్జ్ చేస్తే రూ.50 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇందుకోసం MKTSKY ప్రోమోకోడ్ ఉపయోగించాలి. ఇక లేజీపేతో కనీసం రూ.349 రీఛార్జ్ చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు 12 నెలలకు ఒకేసారి రీఛార్జ్ చేస్తే 2 నెలలు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)