1. భారతీయ రైల్వేలో వేర్వేరు జోన్లల్లో పనిచేస్తున్న 14 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే ఉద్యోగులకు డిజిటల్ సేవల్ని అందిస్తోంది భారతీయ రైల్వే. ఉద్యోగులు తమ డాక్యుమెంట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిజీలాకర్ (Digilocker) ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైల్వే ఉద్యోగులు తమ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని డిజీలాకర్ ద్వారా యాక్సెస్ చేయొచ్చని భారతీయ రైల్వే ప్రకటించింది. డిజీలాకర్ యాప్‌లో ఈ డాక్యుమెంట్స్‌ని సులువుగా డౌన్లోడ్ చేయొచ్చు. 2019-2021 వరకు ఫామ్ 16 కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. డిజీలాకర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఈ డాక్యుమెంట్స్ పొందొచ్చని రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైల్వే ఉద్యోగులు మాత్రమే కాదు పెన్షనర్లకు కూడా డిజీలాకర్ ద్వారా కావాల్సిన డాక్యుమెంట్స్ అందిస్తోంది భారతీయ రైల్వే. పెన్షనర్లు ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (e-PPO) డిజీలాకర్ ద్వారా సులువుగా పొందొచ్చు. పెన్షనర్లు రైల్వే పెన్షన్ పోర్టల్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైల్వే ఉద్యోగులు డిజీలాకర్ ద్వారా డాక్యుమెంట్స్ పొందాలనుకుంటే ముందుగా డిజీలాకర్ యాప్ డౌన్లోడ్ చేయాలి. లేదా https://www.digilocker.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాతపేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. లాగిన్ చేసిన తర్వాత డిజీలాకర్‌లో రైల్వే సెక్షన్లోకి వెళ్లి తమకు కావాల్సిన డాక్యుమెంట్స్ పొందొచ్చు. డిజీలాకర్ ద్వారా ఆధార్ కార్డ్, ఈపీఎఫ్ఓ, డ్రైవింగ్ లైసెన్స్, ఈఎస్ఐ, పెన్షన్ లాంటి అనేక సెక్షన్స్ ఉంటాయి. యూజర్లు తమకు కావాల్సిన డాక్యుమెంట్స్ సులువుగా పొందొచ్చు. ఇందులో తీసుకున్న డాక్యుమెంట్స్ అధికారికంగా చెల్లుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. భారత ప్రభుత్వం రూపొందించిన డిజీలాకర్ ప్లాట్‌ఫామ్ బాగా పాపులర్ అయింది. ఇప్పటివరకు డిజీలాకర్ ప్లాట్‌ఫామ్‌ను 10.8 కోట్లకు పైగా యూజర్లు ఉపయోగిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు 5.1 బిలియన్ల డాక్యుమెంట్స్‌ని జారీ చేయడం విశేషం. 2015 సంస్థలు డాక్యుమెంట్స్ జారీ చేస్తున్నాయి. డిజీలాకర్‌లో 579 రకాల డాక్యుమెంట్స్ సేవ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. డిజీలాకర్ యాప్‌లో ఇప్పటివరకు డౌన్లోడ్ చేసిన టాప్ 10 డాక్యుమెంట్స్ వివరాలు చూస్తే ఆధార్ కార్డ్, పాలసీ డాక్యుమెంట్, పాన్ వెరిఫికేషన్ రికార్డ్, టూవీలర్ ఇన్స్యూరెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, వెహికిల్ ట్యాక్స్ రిసిప్ట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఎల్పీజీ సబ్స్క్రిప్షన్ వోచర్, యూఏఎన్ కార్డ్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)