1. మోటోరోలా ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వరుసగా కొత్త మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. జీ సిరీస్‌లో ఇటీవల మోటో జీ32, మోటో జీ42, మోటో జీ82, మోటో జీ62 5జీ మోడల్స్ రిలీజ్ చేసింది. వీటిలో మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.17,000 వరకు తగ్గింపు పొందొచ్చు. (image: Motorola India)
2. మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే, 5,000ఎంఏహె బ్యాటరీ లాంటి ప్రరత్యేకతలు ఉన్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. మోటో జీ62 5జీ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. (image: Motorola India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి పలు బ్యాంకుల నుంచి ఆఫర్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1750 వరకు తగ్గింపు, ఎస్బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ ద్వారా కొనేవారికి ఆఫర్స్ ఉన్నాయి. కేవలం రూ.624 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ప్రారంభం అవుతాయి. (image: Motorola India)
4. మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పోకో ఎక్స్4 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Motorola India)
5. మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇతర బ్లోట్‌వేర్, జంక్ వేర్ ఉండదు. ఒక ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. (image: Motorola India)
6. మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ డెప్త్ సెన్సార్‌గా కూడా పనిచేస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Motorola India)
7. మోటో జీ62 5జీ మొబైల్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ స్పీకర్స్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్నైట్ గ్రే, ఫ్రాస్టెడ్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. మోటో జీ62 5జీ మొబైల్‌కి ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ లభించనుంది. థింక్ షీల్డ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. (image: Motorola India)