1. వివో ఇండియా స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. వివో ఇండియా ఇ-స్టోర్‌లో వివో వీ23ఈ 5జీ (Vivo V23e 5G) స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.5,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఈ ఆఫర్ ఉంది. మే 10 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. మొత్తం చెల్లించినా, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ఈ ఆఫర్ లభిస్తుంది. (image: Vivo India)
2. వివో ఇండియా వివో వీ23 సిరీస్‌లో వివో వీ23ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు నెలల క్రితం రిలీజైంది. అంతకన్నా ముందే వివో వీ23 సిరీస్‌లో వివో వీ23, వివో వీ23 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వివో వీ23ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 44మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Vivo India)
3. వివో వీ23ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.25,990. వివో ఇండియా ఇ-స్టోర్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వివో వీ23ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.20,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Vivo India)
4. వివో వీ23ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ రూ.2,888 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Vivo India)
5. వివో వీ23ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. లేటెస్ట్గా రిలీజైన రియల్మీ 9, రెడ్మీ నోట్ 11టీ, లావా అగ్ని 5జీ, రియల్మీ 8ఎస్ స్మార్ట్ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Vivo India)
6. వివో వీ23ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో ఎక్స్టెండెడ్ ర్యామ్ 2.0 ఫీచర్ ఉంది. 4జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మిడ్నైట్ బ్లూ, సన్‌షైన్ గోల్డ్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Vivo India)
7. వివో వీ23ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ లవర్స్ కోసం ఆటోఫోకస్ లెన్స్‌తో 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. (image: Vivo India)
8. వివో వీ23ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,050ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 30నిమిషాల్లో 69శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. (image: Vivo India)