తక్కువ ధరకే యాపిల్ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? మొబెక్స్ అనే ప్లాట్ఫామ్లో ఐఫోన్ 12 తక్కువ ధరకే లభిస్తోంది. మొబెక్స్ అనేది రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్. ఇందులో సెకండ్ హ్యాండ్ ఫోన్లను విక్రయిస్తారు. మీరు రిఫర్బిష్డ్ ఐఫోన్ 12ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
కాగా మరోవైపు యాపిల్ ఇటీవలనే ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ మునపటి మోడళ్లపై ధరలు తగ్గించింది. అందువల్ల ప్రస్తుతం ఐఫోన్స్‌పై సూపర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 12 అమ్మకాలు దుమ్మురేచిపోతున్నాయి. గత ఏడాది బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌గా కూడా ఐఫోన్ 12 నిలిచింది. అంటే ఏ రేంజ్లో ఈ ఫోన్‌ను కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.