రెడ్మి 10 ఫోన్‌పై మరో ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఏకంగా ఈ ఫోన్‌పై రూ. 10,400 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తోంది. అంటే మీరు ఫోన్ ధరతో పోలిస్తే.. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కొంటే అప్పుడు మీకు ఫోన్ రూ. 599కే లభించినట్లు అవుతుంది. ఫోన్ మోడల్, దాని కండీషన్ ప్రాతిపదికన ఎక్స్చేంజ్ విలువ మారుతుంది.
మీరు 3 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ. 3753 చెల్లించాలి. అదే ఆరు నెలలు అయితే రూ. 1909 కట్టాలి. 9 నెలలు ఈఎంఐ అయితే రూ. 1295 ఈఎంఐ పడుతుంది. 12 నెలలు అయితే రూ. 988 చెల్లించాలి. 18 నెలలు అయితే రూ. 682 కట్టాల్సి ఉంటుంది. 24 నెలలు అయితే రూ. 539 ఈఎంఐ పడుతుంది. ఇకపోతే ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లేదు. పాత ఫోన్ ఇచ్చేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. మీ ఫోన్‌కు ఎంత వ్యాల్యూ ఉందో చెక్ చేసుకోండి.