అలాగే ఎక్కువ లైక్స్ పొందిన కామెంట్‌కు ఉచితంగా నథింగ్ స్మార్ట్‌ఫోన్ 1 లభిస్తుంది. విన్నర్ 24 గంటల్లోగా ప్రకటిస్తారు. అంటే ఇద్దరికి ఉచితంగానే నథింగ్ స్మార్ట్‌ఫోన్స్ లభిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఉచితంగా స్మార్ట్‌ఫోన్ పొందటం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే ప్రతి కామెంట్‌కు లైక్స్ ఉన్నాయి.
ఇకపోతే నథింగ్ ఫోన్ 1 అనేది మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 27,499 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు వర్తిస్తుంది. అలాగే 256 జీబీ మెమరీ వేరియంట్ రేటు అయితే రూ. 30,499గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. రూ. 33,499గా ఉంది. ఈ ఫోన్లు అన్నీ ఆన్లైన్లో ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి కంపెనీ ఫౌండర్ గుడ్ న్యూస్ అందించారు. ఈ ఫోన్లలోనే తొలిగా గూగుల్ పర్సనల్ సేఫ్టీ సూట్ యాప్ అందుబాటులో రానుంది. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకే ఈ ఫీచర్ కేవలం పిక్సెల్ స్మార్ట్ఫోన్లలోనే ఉంది. యాపిల్ కూడా ఇటీవల తన ఐఫోన్లలో ఈ ఫీచర్ తెచ్చింది.