గూగుల్. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ పరిచయమైన పదం. ఈ గూగుల్ అంటే తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. మనకు తెలియని ప్రతీ ప్రశ్నకు జవాబును తెలియజేస్తుంది. ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇలా అడ్రస్ వెతకడం నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ వరకు ఏ విషయం కావాలన్నా ముందుగా సెర్చ్ చేసేది గూగుల్లోనే.. అంతలా మనం గూగుల్‌కు అలవాటు పడిపోయాం. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే గూగుల్ సెర్చ్ లో దొరికే సమాచారం అంతా నిజమేనా.. అంటే కాదనే చెప్పాలి.. కొన్ని విషయాలు గూగుల్‌లో వెతికిదే పర్లేదు.. కానీ బ్యాంకింగ్, కస్టమర్ కేర్ నంబర్లు వంటివి కొన్ని వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అలాంటి వాటి గురించి వెతక్కపోవడమే మంచిది. లేదా సైబర్ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంటుంది. అయితే గూగుల్ లో ఎలాంటి సమాచారం వెతకాలి.. ఎలాంటివి వెతకకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏదైనా యాప్ లేదా సాఫ్ట్వేర్లు కావాలంటే చాలామంది గూగుల్‌లో వెతికి ఇన్స్టాల్ చేసుకుంటుంటారు. అవి ఏపీకే ఫైల్ లాగా డౌన్ లోడ్ చేస్తాం. ఇలాంటివి సురక్షితంగా ఉండకపోవచ్చు. ఏదైనా యాప్ లేదా సాఫ్ట్ వేర్ కావాలంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లేదా మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పేరు, ఫోన్ నంబర్, అడ్రస్, మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలను గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. ఇలా మనం సెర్చ్ చేసే ప్రతి విషయాన్ని గూగుల్ స్టోర్ చేసుకుంటుంది. ఇలా స్టోర్ అయినా డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే మాత్రం చిక్కుల్లో పడిపోతాం. అందుకే వ్యక్తిగత వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేయవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)