1. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏడాదికి రూ.999 చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. అయితే ఇందుకోసం మీ వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అమెజాన్ ఇండియా అందిస్తున్న యూత్ ఆఫర్ ఇది. కొత్త ప్రైమ్ మెంబర్స్‌ని చేర్చుకోవడం కోసం, ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు అమెజాన్ ఇండియా ఈ ఆఫర్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మాత్రమే కాదు. మూడు నెలల మెంబర్షిప్ తీసుకున్నవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.164 ధరకే మూడు నెలల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సాధారణంగా ఇతర యూజర్లు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌కి రూ.329, ఏడాది సబ్‌స్క్రిప్షన్‌కి రూ.999 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)