1. గార్మిన్ ఇండియా మరిన్ని లగ్జరీ స్మార్ట్‌వాచ్‌లను (Smartwatch) రిలీజ్ చేసింది. గార్మిన్ మార్క్యూ జెన్2 కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ కలెక్షన్లో మార్క్యూ అథ్లెట్, మార్క్యూ అడ్వెంచర్, మార్క్యూ కెప్టెన్, మార్క్యూ ఏవియేటర్, మార్క్యూ గోల్ఫర్ మోడల్స్‌ని తీసుకొచ్చింది. అడ్వెంచర్ ఇష్టపడే వారికోసం ఈ కలెక్షన్ రూపొందించింది గార్మిన్. (image: Garmin India)
2. గార్మిన్ మార్క్యూ జెన్2 కలెక్షన్ స్మార్ట్‌వాచ్‌లన్నీ రూ.1 లక్ష పైనే ఉన్నాయి. గార్మిన్ మార్క్యూ అథ్లెట్ ధర రూ.1,94,990, గార్మిన్ మార్క్యూ అడ్వెంచర్ ధర రూ.2,15,490, గార్మిన్ మార్క్యూ కెప్టెన్ ధర రూ.2,25,990, గార్మిన్ మార్క్యూ ఏవియేటర్ ధర రూ.2,46,490, గార్మిన్ మార్క్యూ గోల్ఫర్ ధర రూ.2,35,990. (image: Garmin India)
3. గార్మిన్ మార్క్యూ జెన్2 కలెక్షన్ స్మార్ట్‌వాచ్‌లలో అమొలెడ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, సఫైర్ లెన్స్, గ్రేడ్ 5 టైటానియం లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో రీఛార్జబుల్ లిథియం బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 16 రోజుల పాటు పనిచేస్తుంది. జీపీఎస్‌తో 42 గంటల పాటు స్మార్ట్‌వాచ్ వాడుకోవచ్చు. (image: Garmin India)
4. సూపర్ ప్రీమియం క్వాలిటీ, సరికొత్త ఆవిష్కరణతో ఈ స్మార్ట్‌వాచ్‌లను రూపొందించామని, ప్రతీ వాచ్ అద్భుతమైన డిజైన్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌వాచ్‌ల సేల్ ఫిబ్రవరి 25న ప్రారంభం అవుతుంది. అమెజాన్, టాటా లగ్జరీ లాంటి ఆన్లైన్ ఇ-కామర్స్ సైట్లతో పాటు గార్మిన్ బ్రాండ్ స్టోర్‌లో కొనొచ్చు. (image: Garmin India)
5. గార్మిన్ మార్క్యూ జెన్2 కలెక్షన్ స్మార్ట్‌వాచ్‌లలోని ఇతర ఫీచర్స్ చూస్తే మల్టీ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, గార్మిన్ SatIQ టెక్నాలజీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణంలో అయినా పొజిషనింగ్‌ను ఖచ్చితంగా గుర్తించగలుగుతుంది. బ్యాటరీ లైఫ్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. సరైన శాటిలైట్ మోడ్ ఎంచుకోవడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. (image: Garmin India)