టాప్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తమ లేటెస్ట్ డివైజ్‌లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న మోడల్స్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)- 2023 వేదికపై ఇంట్రడ్యూస్ చేయనున్నాయి. బార్సిలోనాలో ఫిబ్రవరి 27న ఈ మెగా ఈవెంట్ మొదలవుతుంది. మార్చి 2 వరకు జరుగుతుంది. ఇప్పుడు వచ్చే నెల ఫిబ్రవరిలో లాంచ్ కానున్న స్మార్ట్ఫోన్లు, వాటి స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేద్దాం.
* వన్‌ప్లస్ 11 5జీ : ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో ఫిబ్రవరి 7న లాంచ్ కానుంది. ఇది మూడు వేరియంట్లలో లాంచ్ కానుంది. 6.7 అంగుళాల E4 LTPO 3.0 ఓఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్‌తో ఇది లాంచ్ కానుంది.
* శామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ : స్మార్ట్‌ఫోన్ టాప్ బ్రాండ్ శామ్సంగ్... గెలాక్సీ S23 సిరీస్‌ను ఫిబ్రవరి 1న భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్‌లో శామ్సంగ్ గెలాక్సీ S23, S23 ప్లస్, S23 అల్ట్రా వంటి మోడల్స్ ఉండనున్నాయి. హై-ఎండ్ రేంజ్లో వస్తున్న శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో 6.8-అంగుళాల డిస్ప్లే, 256 GB ఇంటర్నల్ మెమరీ, రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 40MP సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది.
* ఒప్పొ ఫైండ్ N2 ఫ్లిప్ : చైనీస్ బ్రాండ్ ఒప్పొ.. పోర్టబుల్ స్మార్ట్‌ఫోన్స్ ఒప్పొ ఫైండ్ N2, ఒప్పొ ఫైండ్ N2 ఫ్లిప్‌ను ఇప్పటికే చైనాలో లాంచ్ చేసింది. అయితే ఒప్పొ ఫైండ్ N2 ఫ్లిప్‌ను వచ్చే నెలలో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఫైండ్ ఎక్స్ సిరీస్‌పై కీలక ప్రకటన చేయనుంది. దీంతో ఈ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం ఉంది.
* మోటరోలా ఎడ్జ్ 40 ప్రో : మోటరోలా చెందిన ఈ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బార్సిలోనా వేదికగా జరిగే MWC -2023లో లాంచ్ కావచ్చు. గత నెలలో చైనాలో లాంచ్ అయిన Moto X40 రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా ఇది వస్తున్నట్లు సమాచారం. భారత్‌లో మాత్రం ఈ హ్యాండ్సెట్ మార్చిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. FHD+ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 6.67-అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 600mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది.
* రియల్మీ GT Neo 5 : ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. అయితే MWC -2023లోనా లేదా అంతకంటే ముందు చైనాలో లాంచ్ చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో OIS (IMX890 సెన్సార్)తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP హెల్పర్, 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. 1.5K రిజల్యూషన్ (1,240 x 2,772px), 144Hz రిఫ్రెష్ రేట్, ప్లస్ హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ (2,160Hz)తో 6.7 అంగుళాల డిస్ప్లే వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది.