ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కంపెనీలు ధర ఆధారంగా ఫోన్లలో ఫీచర్లను అందిస్తున్నాయి. అయితే కొన్ని మోడళ్లు మాత్రం అన్ని రకాల ఫీచర్లతో యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నాయి. వీటి ధర కూడా భారీగా లేదు. రీజనబుల్ కాస్ట్లో పవర్ ప్యాక్డ్ మోడల్స్‌గా పేరున్న ఆల్‌రౌండర్ స్మార్ట్ఫోన్లుగా ఇవి పాపులర్ అయ్యాయి. ఈ లిస్టులో ఉన్న డివైజ్‌లు ఇవే..
iQOO Z6 Pro 5G : ఐక్యూ Z6 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.20,999గా ఉంది. ఐక్యూ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్సెట్తో రన్ అవుతుంది. 66W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 4700mAh బ్యాటరీతో వస్తుంది. డివైజ్ 6.4 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 64MP + 8MP వైడ్ యాంగిల్ + 2MP మాక్రో కెమెరా రియల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
* Motorola Edge 30 : మోటరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.22999గా ఉంది. మోటరోలా అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. 13 5G బ్యాండ్లతో స్నాప్‌డ్రాగన్ 778G+ 5G చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇది డాల్బీ అట్మోస్‌తో పాటు 6.5 అంగుళాల POLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 32MP ఫ్రంట్ కెమెరా, 50MP + 50MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.
* Samsung Galaxy M53 5G : ఈ ఫోన్ ధర రూ.23,999. శామ్సంగ్ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇది 6nm ఆక్టా-కోర్ చిప్సెట్, 5000mAh బ్యాటరీతో వస్తుంది. 6.7 అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, హై రిజల్యూషన్ అందిస్తుంది. సోనీ IMX 616 సెన్సార్‌తో 32 MP ఫ్రంట్ కెమెరా, 108MP రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
* Redmi Note 12 Pro : ఈ ఫోన్లో 16MP ఫ్రంట్ కెమెరా, సోనీ IMX766 సెన్సార్‌కు సపోర్ట్ ఇచ్చే 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. మీడియాటెక్ డైమన్సిటీ 1080 5G చిప్సెట్, 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.67 అంగుళాల 120Hz ప్రో AMOLED డిస్ప్లే అందిస్తుంది. రెడ్మీ నోట్ 12 ప్రోను కంపెనీ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ.24999 గా ఉంది.
* Realme 10 Pro Plus 5G : రియల్మీ 10 ప్రో ప్లస్ 5G ఫోన్ ప్రీమియం డిజైన్, పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13, రియల్మీ UI 4.0తో వస్తుంది. 6.7 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ 108 MP AI ట్రిపుల్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఈ మొబైల్ రియల్మీ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ.24999 గా ఉంది.