* Samsung Galaxy F23 5G : శామ్సంగ్ గెలాక్సీ F23 5G కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మంచి బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. గలాక్సీ M13 5G ఫీచర్లలో 120Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 750 SoC, 6,000mAh బ్యాటరీ, వివిధ రకాల 5G బ్యాండ్లకు సపోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ప్రైస్‌లో అత్యుత్తమ ఫీచర్లను అందిస్తోంది.
* Poco M4 5G :ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి పోకో M4 5G మంచి ఆప్షన్. ఈ డివైజ్‌లో MediaTek డైమెన్సిటీ 700 SoC ఉంది, ఇది సాధారణ టాస్క్‌లను అమలు చేయడానికి సరిపోతుంది. పోకో M4 5G ఆకర్షించే డిజైన్‌తో వస్తుంది. ముఖ్యంగా ఎల్లో, బ్లాక్ కలర్స్ కాంబోలో అందంగా మృదువుగా కనిపిస్తుంది. 90Hz వైబ్రెంట్ డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్, ఏడు 5G బ్యాండ్లకు సపోర్ట్ చేసే ఫీచర్లు ఉన్నాయి.
* OPPO A74 5G : వాస్తవానికి ఒప్పో A74 5G ధర ఇ-కామర్స్ వెబ్సైట్లలో రూ.15,500గా ఉంది. అదనంగా రూ.500 ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ బడ్జెట్ ఫోన్‌ను పరిశీలించవచ్చు. బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్లలో OPPO A74 ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 480 SoC, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ, 48MP ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. బరువు కేవలం 188 గ్రాములు మాత్రమే.
* iQOO Z6 Lite 5G : ప్రస్తుతం మార్కెట్లో రూ.15,000లోపు లభిస్తున్న ఫోన్లలో ఐక్యూ Z6 లైట్ 5G బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC చిప్సెట్తో వస్తుంది. Android 12లో సరికొత్త Funtouch OS సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. 120Hz డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. అయితే ఐక్యూ Z6 లైట్‌తో పాటు ఛార్జర్‌ను కంపెనీ అందించదు. విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.