ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు భారత్ హబ్‌గా మారింది. టాప్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడం కోసం వివిధ సెగ్మెంట్లలో డివైజ్‌లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. బెస్ట్ ఫీచర్స్‌తో రూ.20వేలలోపు అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్స్ 5G స్మార్ట్ఫోన్లు ఏవో పరిశీలిద్దాం.
* Realme 10 Pro : ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,999కు అందుబాటులో ఉంది. రియల్మీ 10 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేటుతో 6.72 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. జీరో బెజెల్స్‌తో వైబ్రెంట్ డిస్ప్లే కారణంగా కంటెంట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్సెట్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ, స్టీరియో స్పీకర్స్, 108 MP+2 MPతో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 16 MP సెల్ఫీ కెమెరా, యూఎస్బీ టైప్-C 2.0, ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్ వంటి స్పెసిఫికేషన్స్.. ఈ ఫోన్ ప్రత్యేకతలు.
* Redmi Note 12 : రెడ్మీకి నోట్ 12 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.17,999 ధర వద్ద లభిస్తుంది. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల సూపర్ AMOLED డిస్ ప్లే ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ, 48 MP + 8 MP + 2 MP తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, డ్యుయల్ కలర్ LED ఫ్లాష్, 13 MP ఫ్రంట్ కెమెరా, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.
* Poco X5 : ఈ 5G స్మార్ట్‌ఫోన్ రూ.18,999 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. పోకో X5 ఫోన్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా(48 MP + 8 MP + 2 MP) సెటప్, 13 MP సెల్ఫీ కెమెరా, యూఎస్బీ టైప్-C పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
* iQOO Z6 : ఐక్యూ Z6 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,710కు అందుబాటులో ఉంది. దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల IPS LCD డిస్ప్లేతో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. ఇది 4 GB RAM తో కనెక్ట్ అయి ఉంటుంది. 50 MP + 2 MP + 2 MPతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, LED ఫ్లాష్, 16 MP ఫ్రంట్ కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ వంటి స్పెసిఫికేషన్స్‌తో ఈ డివైజ్ కస్టమర్లను ఆకర్షిస్తోంది.